తెలుగు రాష్ట్రాలకు బయలుదేరుతున్న 1000 మంది యాత్రికులు.

250

రాజ్యసభ సభ్యులు  జీవీఎల్ నరసింహారావు  చొరవతో వారణాసి నుండి తెలుగు రాష్ట్రాలకు బయలుదేరుతున్న 1000 మంది యాత్రికులు..

లాక్-డౌన్ కు ముందు వారణాసి యాత్రకు వెళ్లి చిక్కుకుపోయిన ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 1000 మంది భక్తులకు అండగా నిలిచిన బిజెపి రాజ్యసభ సభ్యులు నరసింహారావు.

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1000 మంది తెలుగు యాత్రికులు వారణాసిలో చిక్కుకున్నారు.
అక్కడ వారికి వసతి, ఆహార సౌకర్యాలు కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు  ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం మరియు వారణాసికి చెందిన అధికారులతో సమన్వయం చేస్తూ గత నెల 22వ తేదీ నుంచి వారి యోగక్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా  జీవిఎల్ నరసింహారావు  ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ గారి కార్యాలయ అనుమతితో  జీవిఎల్ నరసింహారావు  నేడు 1000 మంది తెలుగు యాత్రికులను తమ తమ నివాసాలకు తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టారు.

నేటి సాయంత్రం జీవిఎల్ నరసింహారావు  నేతృత్వంలో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక బస్సుల ద్వారా రెండు తెలుగు రాష్ట్రలకూ యాత్రికులను పంపుతోంది.

యాత్రికులు పూర్తిగా ఇంటికి చేరే వరకు వారు ప్రయాణించే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్రంలోని వారు ఉన్న జిల్లాలోని అధికారులను సమన్వయం చేస్తున్నామని జీవీఎల్ నరసింహరావు తెలిపారు.
ఇప్పటివరకు 15 బస్సులను ఏర్పాటు చేశారు. ఈ రాత్రిలోనే మిగిలిన యాత్రికుల బయలుదేరేందుకు మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.