శవాల్ని కాల్చే “కాటికాపరుల” కుటుంబాలకు ఆహారం అందజేత

214

కోవిద్-19 కరోనా వైరస్ వ్యాధి లాక్ డౌన్ సందర్భంగా 9-4-2020 గురువారం గుంటూరు నగరంలోని జన్మభూమి కాలనీ లోని కాటికాపరుల కాలనీ వాసులైన గుంటూరు జిల్లాలోని గ్రామ, మండల,పట్టణ,నగరంలో వున్న అన్ని శ్మశానాల్లో చనిపోయిన వారి శవాల్ని కాల్చే “కాటికాపరుల” యొక్క కుటుంబాలకు వారి కాలనీ లొనే ఉచిత అన్న సమారాధన కార్యక్రమాన్ని “ఎపి. బ్రాహ్మణ చైతన్య వేదిక” మరియు “అయ్యప్ప సేవా సమాఖ్య” రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

వారితో పాటు అన్నార్తులైన,నిరాశ్రయులైన పేదవారికి, ప్రజారోగ్య రక్షణార్ధం విధులు నిర్వర్తిస్తున్న పోలీసు వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య, ఆరోగ్య సిబ్బందికి వారి వద్దకే స్వయంగా వెళ్లి రుచి,శుచికరమైన భోజనం,మంచినీరు, పండు, బిస్కెట్లు అందజేశారు..
ఆహారం కావాల్సిన వారు 9394101081 కి ఫోన్ చెయ్యగలరు. మీ దృష్టికి వచ్చిన అన్నార్తుల కోసం తమకు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కుందుర్తి భాస్కర్ శర్మ, , వడ్డమాను ప్రసాదు, శ్రీలక్ష్మి, రంజిత,భవాని,పార్వతి, మాడ శ్రీనివాస్, కూరపాటి కిషోర్, శ్రీకాంత్, సాంబయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు