ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 లక్షల రూపాయలను అందించిన హరికృష్ణ

132

కరోనా నియంత్రణ కు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు తమవంతు చేయూతగా మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మోండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 లక్షల రూపాయలను మున్సిపల్ శాఖ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావుకు శుక్రవారం ప్రగతి భవన్ లో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత సమయంలో అనేక మంది నిరు పేదలు, వలస కూలీలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.