అన్నార్తులకు ఆహారాన్ని అందజేయడమే లక్ష్యం…

వీధి బిక్షగాళ్ళకి దినసరి ఆహారాన్ని తక్షణమే అందజేయాలి…

కోవిద్-19 కరోనా వైరస్ వ్యాధి లాక్ డౌన్ సందర్భంగా 8-4-2020 బుధవారం గుంటూరు నగరంలోని బుడగజంగాల కాలనీ (“ఎన్జీవో కాలనీ చివర”) నివసిస్తు రోజువారీ భిక్షాటన చేసే పగటి వేషగాళ్ళు, చిలకప్రశ్న, గంగిరెద్దుల వారికీ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి చేతివృత్తులు చేసుకునేవారికి ఉచిత అన్నసేవా సమారాధన కార్యక్రమాన్ని “ఎపి. బ్రాహ్మణ చైతన్య వేదిక” మరియు “అయ్యప్ప సేవా సమాఖ్య” రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

గుంటూరు నగరంలో ఉత్తరప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాల నుండి వచ్చి చేతివృత్తులు చేసుకునేవారికి అన్నార్తులైన,నిరాశ్రయులైన పేదవారికి, ప్రజారోగ్య రక్షణార్ధం విధులు నిర్వర్తిస్తున్న పోలీసు వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య, ఆరోగ్య సిబ్బందికి వారి వద్దకే స్వయంగా వెళ్లి రుచి,శుచికరమైన భోజనం,మంచినీరు, పండు, బిస్కెట్లు అందజేశారు..
ఆహారం కావాల్సిన వారు 9394101081 కి ఫోన్ చెయ్యగలరు. మీ దృష్టికి వచ్చిన అన్నార్తుల కోసం తమకు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కుందుర్తి భాస్కర్ శర్మ, , వడ్డమాను ప్రసాదు, వి. చైతన్య శర్మ, శ్రీలక్ష్మి, రంజిత,భవాని,పార్వతి, మాడ శ్రీనివాస్, కూరపాటి కిషోర్, శ్రీకాంత్, సాంబయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami