కరోనా కట్టడి చర్యలకు తనవంతు చేయూత

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు అంగీకార లేఖ

కరోనా వైరస్ నివారణ చర్యలకు సహకరించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ తనదైన శైలి లో స్పందించారు. ప్రధాని పిలుపును అందుకున్న మరుక్షణమే తన జీతంలో సంవత్సరం పాటు ముఫైశాతం కోతకు స్వఛ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ మేరకు గౌరవ గవర్నర్ స్వయంగా మంగళవారం రాష్ట్రపతికి అంగీకార లేఖను రాసారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపడుతూ వస్తొంది. ఈ క్రమంలోనే అర్ధిక పరమైన వెసులుబాటు కోసం పలు కార్యక్రమంలు తీసుకుంటుండగా, ప్రధాని మోది సోమవారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంటు సభ్యుల నిధుల రద్దు, వారి జీతాలలో కోత వంటి వాటితో పాటు, రాజ్యాంగ అధినేతలుగా ఉన్న రాష్ట్ర పతి, ఉప రాష్ట్ర పతి, గవర్నర్లు స్వఛ్ఛంధంగా జీతాల కోతకు ముందుకు వస్తున్నారని ప్రకటించారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ తన జీతం నుండి ప్రతి నెల 30 శాతం  నిధులను మినహాయించి కరోనా కట్టడికి వ్యయం చేయాలంటూ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు లేఖ రాసారు. గవర్నర్ అదేశాల మేరకు రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లేఖ రాస్తూ సామాజిక బాధ్యతలో భాగంగా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, తదనుగుణ ఏర్పాట్లు చేయాలని కోరారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner