కరోనా సమయంలో గ్రావెల్ కాసులు

150

ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భయబ్రాంతులకు గురి అవుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని అవగాహన కార్యక్రమాల్లో ఉంటే గ్రామాల్లో మాత్రం ప్రభుత్వ ఇళ్ల స్థలాలో గ్రావెల్ పేరిటజేబులు నింపుకుంటున్నారు

కొంతమంది చోటా నాయకులను అడ్డగించిన గ్రామస్తులు

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో లాక్ టౌన్ కు కరోనా వైరస్ వ్యాప్తికి నీళ్లు వదిలేసినా కోంత మంది వ్యక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇళ్లస్థలాల కి గ్రావెల్ కావాలంటూ గ్రామానికిఅనుకుని మునేటి వద్ద పెద్ద పెద్ద గుంతలు తీస్తూ అనుమతులు లేకుండా గ్రావెల్ తోలుతున్న ట్రాక్టర్ ల తో సహా గ్రావెల్ ముఠా ను అడ్డుకున్న గ్రామస్తులు ఘర్షణ వాతావరణం నెలకొంది ప్రభుత్వం యంత్రాంగం అంతా పూర్తిగా స్తంభించి కరోనా లాక్ డౌన్ఉంటే దానికి విరుద్ధంగా మట్టి తవ్వకాలు ఆగ్రహం తో గ్రామస్తులుఅడ్డుకున్నారు

గ్రామానికి అనుకుని కృష్ణానది వున్నది అని కొన్ని వందల కుటుంబ నివాస ప్రాంతం లో నే పెద్ద పెద్ద గుంతలు తీసి అక్కడి నుంచి గ్రావెల్ తవ్వకాలు జరపడంవల్లవచ్చే వర్షాకాలం లో కృష్ణా నది నీరు అంతా గ్రామంలోకి ప్రవేశిస్తుందని గతంలో ఈ త్రవ్వకాల గుంటల్లో పడి కొంత మంది చనిపోయారని వచ్చే వరద తాకిడికి గ్రామమంతా కొట్టుకుపోతుందని తక్షణమే ఈ మట్టి తవ్వకాలను నిలుపుదల చేయాలని లేదంటే ఊరంతా కృష్ణానదిలో కలిసిపోయి జల సమాధి అవుతుందని గ్రామస్తులు వాపోయారు