కరోనా చీకట్లో  వెలిగిన దివ్య దీపోత్సవం

578

ఆసేతు హిమాచలం వెలిగిన జ్యోతులు
ప్రభుత్వ పోరాటానికి జాతి మద్దతు
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా భూతాన్ని తరిమివేయడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో, మేము సైతం అంటూ  ప్రజలు మరోసారి తమ నైతిక మద్దతు ప్రకటించారు. ఆదివారం తొమ్మిదిగంటలకు యావత్ భారతజాతి జనులు, దివ్యకాంతులు వెలిగించారు. ఆసేతు హిమాచలం కరోనాను తరిమివేస్తామంటూ వెలిగించిన జ్యోతులు ప్రజ్వరిల్లాయి. వయో,లింగబేధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లముంగిట వెలిగించిన చిరు దివ్వెలు.. కరోనా బాధితులకు అండగా, మేమున్నామన్న సంఘీభావ సంకేతాలిచ్చాయి.
[metaslider id=”14941″]

చివరకు చిన్నారులు సైతం ఈ మహా దీపోత్సవంలో పాల్గొన్న దృశ్యాలు, ప్రధాని ఇచ్చిన పిలుపు జనంపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో స్పష్టమవుతుంది.  కరోనాపై పోరులో ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో, ఆ మహమ్మారి శలభాల్లా మాడిపోవాలని కోరుకుంటూ వెలిగించిన జ్యోతులు, దేశంలో ఒక్కసారిగా కాంతిరేఖలు నింపాయి. తొమ్మిది నిమిషాలు విద్యుత్ ఆపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ వినతిని దేశ ప్రజలు శాసనంలా ఆచరించి, దేశం పట్ల వారి చిత్తశుద్ధి, అంకితభావం ప్రకటించారు. ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకూ దీపాలు వెలిగించి, దేశప్రజలకు తమ సంఘీభావం ప్రకటించారు.

ప్రతి ఇంట్లో9 గంటల, తొమ్మిది నిమిషాల, తొమ్మిది సెకన్లకు 9 దీపాలు వెలిగిస్తే, ప్రతి దీపపు వెలుగు ఆకాశంలోకి విడుదల అవుతుంది. అప్పుడు నవగ్రహాలన్నీ  ఒకదానితో ఒకటి కలసి, ప్రయాగ అనే కక్ష్యలోకి వస్తాయి. దానివల్ల నవగ్రహాలు అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. అవి ప్రయాగ కక్ష్యలో తిరగటం వల్ల, ఒకేసారి కొన్ని కోట్ల దీపాల వెలుగుల వల్ల, 33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుంచి విముక్తులయి..  ఆ ఫోటాన్ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తి అటామిక్ ఎనర్జీగా మారుస్తారు. అదే కరోనాను చంపుతుందన్నది శాస్త్రజ్ఞుల ఉవాచ. ఈ భావన నిజమయినా.. అబద్ధమయినా.. నమ్మకం లాంటిదయినా..  మూఢత్వమనుకున్నా.. ప్రజలు దీనిని త్రికరణశుద్ధితో పాటించి సమైక్యతను ప్రదర్శించటమే గొప్పతనం. జాతిజనులను ఏకం చేసిన ఘనత మాత్రం నరేంద్రుడిదే! శహభాష్ మోదీ!!ఇది కూడా చదవండి: సర్వోన్నత..  సగౌరవ.. సంఘీభావ సంకేతం!