ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

506

COVID-19 అన్ని దేశాల్లో వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో విదేశాలలో ఉన్న భారత విద్యార్థుల గురించి భారత విదేశాంగ శాఖ మంత్రితో, భారత అంబాసడార్స్ తో సంప్రదించిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉండి స్వదేశానికి రావాలని ఆకాంక్షించే భారతీయ విద్యార్థుల పరిస్థితిపై శుక్రవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు భారత విదేశాంగ మంత్రి  యస్.జయశంకర్ తో మాట్లాడారు.

కోవిడ్19 కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర దేశాల్లో ఉన్న భారత పౌరులు, విద్యార్థులు మరియు తెలుగు వారి క్షేమ సమాచారం అక్కడి సౌకర్యాల గురించి కేంద్ర విదేశాంగ మంత్రి యస్.జయశంకర్ తో జీవిఎల్ నరసింహారావు చర్చించారు.

మీడియా, సోషల్ మీడియా ద్వారా వస్తున్న వార్తలు వాటిల్లో వాస్తవ అవాస్తవ కథనాలు, వివిధ దేశాల్లో ఉన్న భారత ఎంబసీల్లో చేపట్టిన ప్రత్యేక చర్యల గురించి విదేశం శాఖ మంత్రితో చర్చించారు.

లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా భారత్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అంతర్జాతీయ విమానయాన సర్వీసులు నిలుపుదల చేయడంతో ఈనెల 14వ తేదీ తర్వాత కేంద్ర ఇచ్చే అనుమతుల ఆధారంగా విదేశాల్లో ఉన్న విద్యార్థులు భారత్ కు వచ్చేందుకు వీలుంటుందని కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా జీవిఎల్ నరసింహారావు  స్పష్టం చేశారు.

వివిధ దేశాల్లో ఉన్న భారత ఎంబసీల్లో ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉండటంపై మరియు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గురించి విదేశాంగ శాఖ మంత్రి యస్.జయశంకర్ తో చర్చించారు.

ప్రస్తుతం కరోనా విస్తృత స్థాయిలో వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో భారతీయులకు మరిన్ని సదుపాయాలు,సౌకర్యాలు తదితర అంశాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జీవిఎల్ నరసింహారావు విజ్ఞప్తి చేశారు.

సామాజిక మాధ్యమాల్లో వచ్చే కొన్ని అవాస్తవ కథనాలకు ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారత ప్రభుత్వం అన్ని ప్రత్యేక చర్యలు తీసుకుందని  జీవిఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.

🔸🔸విదేశాల్లోని భారత ఎంబసీలతో అక్కడి భారతీయుల పరిస్థితిపై చర్చించారు.

🔸 జీవిఎల్ నరసింహారావు గారు ఈ రోజు బ్రిటన్ లోని భారత హైకమిషనర్  రుచి ఘనశ్యామ్ తో మాట్లాడి వివిధ విశ్వవిద్యాలయాల్లోని భారతీయుల,తెలుగు విద్యార్థుల శ్రేయస్సు గురించి ఆరా తీశారు.

భారతీయ విద్యార్థులకు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి భారత హైకమిషన్ సహాయం చేస్తున్న తీరు గురించి భారత హై కమిషనర్  వివరించారు.

కొన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయబడిన తప్పుడు సమాచారానికి విద్యార్థులు బాధితులుగా మారకుండా విద్యార్థులకు సకాలంలో ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉండేలా చూడాలని జీవీఎల్ నరసింహరావు  కోరారు.

🔸నేడు ప్రసార మాధ్యమాల ద్వారా ఉక్రెయిన్లో వైద్య విద్య చదువుతున్న తెలుగు వారు, మరియు భారతీయులు దాదాపు 15,000 మంది పరిస్థితిని భారత విదేశాంగ శాఖ ద్వారా ఉక్రెయిన్ భారత ఎంబసీ పార్థా సత్పతి తో చర్చించారు.
లాక్ డౌన్ పూర్తిస్థాయిలో ఎత్తివేసిన తర్వాత మాత్రమే స్వదేశానికి రావడానికి అవకాశం ఉందని, ఈ లోపు అక్కడ వారికి ఏ సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉండాలని, ఎంబసీ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని జీవీఎల్ నరసింహారావు  తెలిపారు..