కరోనా పేషంట్లకు స్వయంగా ఆహారం అందజేత

436

గుంటూరు:కోవిద్-19 కరోనా వైరస్ వ్యాధి లాక్ డౌన్ సందర్భంగా 4-4-2020 శనివారం గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డు లోని ఐ డి హాస్పిటల్ నందు కరోనా రోగులకు ఉచిత అన్నసేవా సమారాధన కార్యక్రమాన్ని “ఎపి. బ్రాహ్మణ చైతన్య వేదిక” మరియు “అయ్యప్ప సేవా సమాఖ్య” రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

గుంటూరు నగరంలో అమరావతి రోడ్ లో స్థానిక ఐడి హాస్పిటల్ లో ఉన్న 16 మంది కరోనా వ్యాధిగ్రస్తులకు శ్రీధర్ ఆధ్వర్యంలో రోగులకు మానసిక స్థైర్యం నెలకొల్పేందుకు కోసం మరియు వారికి స్వయంగా ఆహారాన్ని అందజేయాలని సంకల్పంతో కరోనా కన్ఫామ్ వార్డ్ మరియు ఐసోలేషన్ వార్డులో ఉన్న వ్యాధి బాధితులకు స్వయంగా ఆహారాన్ని శ్రీధర్ అందజేసి వారికి మానసిక స్థైర్యం కలిగించే విధంగా వారు సంతోష పడేలా వారితో కాసేపు మాట్లాడి అతిత్వరలో ఈ వ్యాధి నుంచి మీరు బయట పడపోతున్నారని మీ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని వారిలో స్థైర్యాన్ని కలిగించారు ఆ తర్వాత హాస్పటల్లో వేరే వార్డుల్లో ఉన్న టీబీ పేషెంట్లు వారి బంధువులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు నర్సులకు హాస్పటల్ సిబ్బంది కి ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లకు అన్నార్తులైన పేదవారికి, ప్రజారోగ్య రక్షణార్ధం విధులు నిర్వర్తిస్తున్న పోలీసు వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య, ఆరోగ్య సిబ్బందికి, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వారికి వారి వద్దకే స్వయంగా వెళ్లి రుచి,శుచికరమైన ఆహారాన్ని అందించారు., భోజనం,మంచినీరు, పండు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాది పై ఆరోగ్య రక్షణ అర్థం దేశం మొత్తం లాక్ డౌన్ విధించినప్పటికీ ఒక ప్రణాళిక లేకుండా పేద ప్రజలు రోడ్లమీద నివసించే వారి గురించి ఆలోచన లేకుండా వాళ్ళ అన్న పానాదులు గురించి ఆలోచించకుండా లాక్ డౌన్ చేయడం వారిపట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూడటం అత్యంత బాధాకరమైన విషయమని, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తమ ఆరోగ్యాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పోలీస్,విలేకరులు,పారిశుద్ధ్య సిబ్బంది కోసం తాము స్వచ్చంద్ధంగా స్పందించి ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రిపూట తృప్తికరంగా భోజన ఏర్పాట్లు చేసినట్లు శ్రీధర్ తెలియజేశారు. తమ సొంత ఖర్చులతో ప్రస్తుతానికి ఈ లాక్ డౌన్ పదిహేను రోజులపాటు నిరాటంకంగా భోజన సదుపాయం కల్పిస్తామని పదిహేను రోజుల తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగితే ఈ అన్న సమారాధన ఇలాగే కొనసాగిస్తామని తెలియజేశారు. కావున ఈ అవకాశాన్ని నిత్యం సద్వినియోగ పర్చుకోవలసిందిగా మనవి చేశారు.
ఆహారం కావాల్సిన వారు 9394101081 కి ఫోన్ చెయ్యగలరు. మీ దృష్టికి వచ్చిన అన్నార్తుల కోసం తమకు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కుందుర్తి భాస్కర్ శర్మ కొరియర్ సురేష్, మసాలా మురళి, వడ్డమాను ప్రసాదు, వి. చైతన్య శర్మ, శ్రీలక్ష్మి, రంజిత,మాడ శ్రీనివాస్, శ్రీకాంత్, రామారావు తదితరులు పాల్గొన్నారు.