ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోండి

581

ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోండి

ప్రజలంతా కరోనాతో పోరాడుతుంటే హైదరాబాద్లో కూర్చొని ట్వీట్లు పెడతారా..?
వలంటీర్లను అవమానించేలా ప్రవర్తించడం బాధాకరం
చంద్రబాబు, పవన్లపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజం
విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి గ్రామ/వార్డు వలంటీర్లు పనిచేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వలంటీర్లను అవమానించేలా ప్రతిపక్షాలు మాట్లాడడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేరళ రాష్ట్రం, బ్రిటన్ లాంటి దేశాలు కూడా వలంటీర్లను నియమిస్తున్నాయన్నారు. విజయవాడలో రేషన్ సరఫరాను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి సీఎం వైయస్ జగన్ అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రజలు నిత్యావసరాలపరంగా, ఇతర అంశాలలో ఇబ్బంది పడకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు.
నిన్నటి నుంచి రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం చొప్పున, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు రేషన్ తీసుకునేవిధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. రేషన్ లబ్ధిదారులు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. నిత్యావసర వస్తువులు అందుబాటు, ప్రతి ప్రాంతంలో రైతుబజార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ఐదు రైతుబజార్లు ఉంటే ఈరోజు 45 రైతుబజార్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
విజయవాడలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. కృష్ణాజిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్లు కరోనా నియంత్రణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. అనుమానితులందరినీ హోమ్ క్వారంటైన్లో ఉంచుతున్నామని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక కరోనా బాధితుడు రికవరీ పొజిషన్లో ఉన్నాడని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
రాష్ట్ర ప్రజలంతా కరోనాతో పోరాడుతుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్లు మాత్రం హైదరాబాద్లో కూర్చొని ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. వలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తుంటే.. వారిని అవమానించే రీతిలో హైదరాబాద్లో కూర్చొని ట్వీట్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీచ రాజకీయాలు మానుకోవాలని పవన్, చంద్రబాబులకు వెల్లంపల్లి సూచించారు. ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ప్రభుత్వాన్ని కించపరిచేలా చేయాలని చూడటం సరైన విధానం కాదని హితవుపలికారు.

నగరములో రేషన్ దుకాణాలను తనిఖీ చేసిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

సోమవారం మంత్రి బ్రాహ్మణ వీధి లోని రామాలయం వీధి, అయ్యప్ప టవర్స్, రామాలయం, కోమల విలాస్ సెంటర్ ఎదురు, చదును మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద, ఆంజనేయ వాగు పెట్రోల్ బంక్ ఎదురుగా సందు తదితర రేషన్ దుకాణాలను మంత్రి తనిఖీ చేశారు…

ఈ సందర్భంగా ప్రజల పలు సమస్యలను మంత్రి దృష్టికి వచ్చారు…

రేషన్ సరఫరాల లో సర్వర్ మొరాయింపు పై మంత్రి ఫోన్ లో సివిల్ సప్లై మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించాలని సూచించారు…
రేషన్ దుకాణాల వద్ద ఉన్న ప్రజలను సామాజిక దూరం పాటించాలన్నారు..

విజయవాడలో నమోదైన నాలుగు పాజిటివ్ కేసులు విదేశాలనుంచి వచ్చిన వారే
వారి బంధువులకు వైద్య పరీక్షలు నిర్వహించాం

ఇళ్ళ నుంచి బయటకు వచ్చే క్రమంలో ప్రతిఒక్కరూ మాస్క్ లు ధరించాల్సిందే

రేషన్ దుకాణాల్లో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది..

ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం కరోనా మహమ్మారిని అరికట్టగలడంలో విజయం సాధించాం

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు 14 రోజులు క్వారంటైన్ లో ఉంటనంటే రండి

క్వారంటైన్ లో ఉన్నవారికి అన్ని వసతులు కల్పిస్తున్నారు

హైద్రాబాద్ లో ఉన్న పవన్, చంద్రబాబు ఎపి ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలి

ఎపిలో జరిగితే హైద్రాబాద్ నుంచి చంద్రబాబు, పవన్ విమర్శించడం సిగ్గుచేటు

వార్డు వాలంటీర్లు, సెక్రటరీలు ప్రాణాలు తెగించి ప్రజల వద్దకు వెళుతుంటే వారి పట్ల వ్యగ్యంగా మాట్లాడడం మానుకోవాలి

చేతనైతే సలహాలు ఇవ్వండి….ఇటువంటి పరిస్ధితుల్లో రాజకీయం మానుకోండి అని హితవు పలికారు..

కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది
ప్రజలు సహకరించాలి…ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని కోరారు..

కరోనా నియంత్రణలో వాలంటీర్లు సేవలు.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వారియర్స్

వైయస్సార్ సిపి ప్రభుత్వం వచ్చాక.. పింఛన్లు పంపిణీ నుంచి కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఫ్రంట్ లైన్ వారియార్స్ గా నిలబడటమే

ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు-వాలంటీర్ల వ్యవస్థ దేశానికి, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంటే.. సిగ్గులేని నేతలు చౌకబారు విమర్శలు మానుకోవాలి..

మాకు ప్రజల సంక్షేమం కావాలి.. చంద్రబాబు, అండ్ ఎల్లో మీడియాకు విమర్శలు.. బురదచల్లటం కావాలి.

ప్రచారం తక్కువ.. పని ఎక్కువ మా ప్రభుత్వానిది..
చంద్రబాబుది పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్నారు…