మీరు.. మనుషులా..? మృగాలా…?

214

ముఖం చాటేస్తున్న మర్కజ్ పర్యాటకులు
వివరాలు ఇవ్వకుండా వైరస్  విస్తరణ
వివరాల సేకరణకు వెళ్లిన వారిపై అనాగరిక దాడులు
చచ్చీ చెడీ పట్టుకుంటున్న పోలీసులు
కనిపించని వారితోనే కలవరం
ముఖం చాటేస్తున్న వారికి మత పెద్దల మద్దతా?
ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న మర్కజ్ కేసులు
(మార్తి సుబ్రహ్మణ్యం)

అది కంటికి కనిపించని మహమ్మారి. దాని పేరు కరోనా. ఏ రూపంలో ఎలా ఆవహిస్తుందో ఎవరికీ తెలియదు. స్వయం నియంత్రణ తప్ప, దానికి నివారణ లేదు. అందుకే ఎవరికి చిన్న జలుబు, దగ్గు, తుమ్ములొచ్చినా వైద్యులు వాలిపోతున్నారు. అంబులెన్సులు, పోలీసులు, వైద్యులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ,  ఆ రోగలక్షణాలున్న వారికి  దగ్గరుండి  చికిత్స చేస్తున్నారు. ఇటు పోలీసులు.. జనం రోడ్డెక్కితే ఆ రోగం విస్తరిస్తుందన్న భయంతో,  సామాజిక బాధ్యతతో రోడ్లను జల్లెడపడుతున్నారు. ప్రభుత్వాలేమో ఆ రోగ లక్షణాలున్న వారిని స్వస్థపరిచేందుకు కాలేజీ, స్కూల్, చివరకు రైలు బోగీలనే క్వారంటైన్లుగా మార్చేస్తున్నాయి. ఇంతమంది.. ఇన్ని లక్షల మంది, ఒక మానవ ప్రాణం కాపాడేందుకు, తమ ప్రాణాలు పణంగా పెట్టి ఇంతగా శ్రమిస్తున్నారు. కానీ, మానవుడే మృగమవుతున్నాడు. ఉన్మాదిగా మారుతున్నాడు. తన రోగాన్ని దాచి,  రోగ లక్షణాలను చెప్పకుండా దాచి, అసలు కనిపించకుండా పారిపోయి, సమాజానికి  రోగం అంటిస్తున్నారు. చికిత్సకు రమ్మని కోరిన  వారిపై, అనాగరిక దాడులకు దిగుతున్నారు. అటు కొందరు మత పెద్దలు కూడా, తమ అడ్డగోలు వాదనలతో, ఈ మానవ మృగాలకు మద్దతునిస్తున్న వికృతసమాజాన్ని ఏమనాలి? మానవ హక్కులు, మైనారిటీ హక్కులంటూ, యాగీ చేస్తున్న వారంతా ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారు? పారిపోయిన మృగాలకు మంచి చెప్పాల్సిన నైతిక బాధ్యత వారికి లేదా?

కరోనా వైరస్‌పై భారత సర్కారు అవిశ్రాంతంగా పోరాడుతోంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు సహకరిస్తున్నాయి. వైద్యులు, పోలీసులు అహరహం శ్రమిస్తున్నారు. కానీ మతమౌఢ్యం వారి పోరాట, సేవా స్ఫూర్తిని నీరుగారుస్తున్నాయి. నిజాముద్దీన్ మర్కజ్‌లో, మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారిలో 70 శాతం మందికి కరోనా పాజిటివ్ తేలింది. అది కూడా పోలీసులు నానా చావు చచ్చి, వారి ఆనుపానులు తెలుసుకున్న తర్వాతనే ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. ఇక మిగిలిన పర్యాటకులు ఎక్కడ ఉన్నారో, ఏ కలుగులో దాక్కున్నారో, వాళ్లు ఈ సమాజానికి ఇంకెంత హాని చేస్తారో, తెలియని భయానక పరిస్థితి. కరోనా కల్లోలాన్ని కళ్లారా చూస్తూ కూడా, మర్కజ్‌కు వెళ్లి, తమ వివరాలు దాచి పెడుతున్న మానవ మృగాల రహస్య సంచారంతో, వారు ఎప్పటికైనా తన ఒడిలోకి రాక తప్పదని మృత్యుదేవత ఆ పరారీగాళ్ల కోసం ఎదురుచూస్తోంది.

నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్ధనలను  వెళ్లి వచ్చిన వారి అడ్రసులు గల్లంతవుతున్నాయి. వివరాలు ఉండి కొంత, లేక మరికొంత.. వారిని కనిపెట్టేందుకు పోలీసులు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కనిపెట్టిన తర్వాత, వారిని ఆసుపత్రుల వరకూ తీసుకువచ్చేందుకు మరో యుద్ధం! మేం రాము పొమ్మని భీష్మించేవారు మరికొందరయితే, విదేశీయులను ఎందుకు పట్టుకోవడం లేదని మరికొందరి వితండ వాదన.

 పోలీసుల కృషి, పట్టుదల ఫలితంగా.. ఎట్టకేలకు మర్కజ్‌కు వెళ్లిన పర్యాటకులు కొందరు, ఆసుపత్రుల్లో బలవంతపు చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాలు వారికి సకల సౌకర్యాలు సమకూర్చాయి. కానీ, ఎటొచ్చీ, కనబడకుండా పారిపోయిన పర్యాటకులతోనే సమాజం బెంబేలెత్తుతోంది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో పాజిటివ్‌గా తేలిన వారంతా, నిజాముద్దీన్‌లో మత ప్రార్ధనల్లో పాల్గొని వచ్చిన వారే. దీనితో ఏపీ-తెలంగాణలో కరోనా కేసులు ఆమాంతం ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏపీ సీఎం జగన్ మాటల్లో చెప్పాలంటే.. 1085 మంది మర్కజ్‌కు వెళితే, వారిలో 585 మందికి టెస్టులు చేశారు. అందులో 70 కేసులు అక్కడి నుంచి వారివే. మరో 500 కేసులు పరిశీలనలో ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 603 మందిని కనుగొనగా, వారిలో 74 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. ఆరుగురు మృతి చెందారు. మొత్తం పదివేల మంది క్వారంటైన్‌లో ఉండగా, చాలామంది తప్పుడు చిరునామాలు ఇవ్వటం మరో దారుణం.

తబ్లీగీ జమాత్ నిర్వహకుడు అక్రమ్ లెక్కల ప్రకారం.. ఆ సంస్థకు కేటాయించిన కోటా ప్రకారం, ఏపీలో అధికారికంగా సమాచారం ఇచ్చి వెళ్లిన వారి సంఖ్య 550 మంది. వారి వివరాలను ఆయన పోలీసులకు అందించారు. మిగిలిన వారంతా అనధికారికంగా వెళ్లిన వారే. మరి వాళ్లంతా ఇప్పుడు ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఎంతమందికి వైరస్ అంటించే పనిలో ఉన్నారు? వారి వల్ల ఎంతమందికి ప్రాణహాని ఉంది అన్నవే ఇప్పుడు భయాందోళన కలిగిస్తున్న ప్రశ్నలు.

వీటికి జవాబు చెప్పాల్సిన పర్యాటకులు, ఇళ్ల నుంచి మాయమయ్యారు. ఎక్కడెక్కడో దాక్కుకున్నారు. వివరాల కోసం వచ్చిన వారిపై అమానవీయ దాడులు చేస్తున్నారు.నిజామాబాద్‌లో వారి చిరునామా తెలుసుకుని వెళ్లిన ఆశా వర్కర్లు, వైద్య సిబ్బందిపై మర్కజ్ పర్యాటకులు దాడులు చేయడం అమానుషం, అమానవీయం.  వివరాలు చెప్పేది లేదు. మాకేం కాదు. మా ఇళ్లలోకి ఎలా వస్తారంటూ దాడికి దిగిన వారి చేష్టలపై ఆ సేవకులు ఖిన్నులయ్యారు. ఒక చానెల్‌లో నిర్వహించిన చర్చను పరిశీలిస్తే.. మత పెద్దలు ప్రాణాంతకమైన ఈ అంశాన్ని కూడా, మతకోణంలోనే చూస్తున్నారంటే.. సమాజానికి వారెంత హాని చేస్తున్నారో స్పష్టమవుతుంది. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజాముద్దీన్‌లో ఉన్న వారిని, క్వారంటైన్‌కు బస్సులో తరలిస్తున్నప్పుడు, వారి ఉన్మాద చేష్టలకు వైద్యులే భయపడిన పరిస్థితి. బస్సులో కూర్చుని, కావాలని బయటకు ఉమ్మివేయడం, వైద్యులపై తుమ్మడం వంటి ఉన్మాద చర్యల వీడియో దృశ్యాలు కూడా చర్చనీయాంశమయింది.

కృష్ణగిరి ప్రాంతంలో నిజాముద్దీన్ వెళ్లివచ్చిన వ్యక్తిని, క్వారంటైన్‌కు వెళ్లాలన్న పోలీసులు కోరారు. అయితే, సదరు పెద్దాయన.. మోదీ 100 దేశాలు తిరిగొచ్చినందున, ముందు ఆయనను టెస్టు చేసుకోమని చెబుతున్న వీడియో చూస్తే.. కరోనాను మనుషుల మాటేమో గానీ, మతం మాత్రం జయించినట్లు అర్ధమవుతుంది. నెల్లూరు జిల్లా మర్రిపాడులో.. నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారిని, క్వారంటైన్‌కు పంపేందుకు చేసిన ప్రయత్నాలను, తొలుత అక్కడి వారు అడ్డుకున్నారు. మిగిలిన  రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని, ఎందుకు తీసుకువెళ్లడం లేదని వాదించారు. చివరకు కొంతమందిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన వీడియో కూడా, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మత పెద్దల ఉన్మాదంతో, అదే వర్గానికి చెందిన సామాన్య ప్రజలు, మొత్తం  సమాజానికి ఎంత ప్రమాదం ఉందో చెప్పే వీడియో ఒకటి, విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక చానెల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న హుస్సేన్ అనే మత పెద్ద.. నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారి వల్ల నష్టమేమీ లేదని, ప్రభుత్వం తన వైఫల్యాన్ని, నిజాముద్దీన్ పేరుతో కప్పి పెడుతోందంటూ చేసిన వాదనపై, జర్నలిస్టు సాయి విరుచుకుపడిన వైనం.. 28 వేల మంది రాష్ట్రానికి వస్తే, వారిని విడిచిపెటి,్ట నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారిపైనే ఎందుకు ఒత్తిడి చేస్తున్నారన్న హుస్సేన్ వాదన..  మీరు మనుషులా? మీకు మానవత్వం ఉందా? వివరాలు దాచి సమాజానికి నష్టం చేస్తారా? అంటూ జర్నలిస్టు సాయి విరుచుకుపడిన తీరు పరిశీలిస్తే.. చివరకు ప్రాణాంతకంగా మారిన వైరస్‌కూ మతం రంగు ఏ స్థాయిలో అద్దుతున్నారో స్పష్టమవుతుంది. నిగ్గదీసి అడిగినా ఇది సిగ్గులేని సమాజం మరి. ఇందులో ఇలాంటి వారంతా జీవచ్ఛవాలే!