సేవా కార్యక్రమాల్లో విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇతర ప్రాంతాలు , రాష్ట్రాల నుంచి భాగ్యనగర్ కు వలస వచ్చిన కార్మికులు, భవన నిర్మాణ కూలీలు, యాచకులు, అనాధలకు ఆహారపు పొట్లాలు అందిస్తున్నారు. వండుకునే అవకాశం ఉన్న వారికి బియ్యం, పప్పు, చింతపండు, కూరగాయలు, నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారు. నగరంలోని పలు కూడళ్ల తోపాటు గల్లీ లో ఉన్నటువంటి వారికి కూడా ఆహారం అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యంగా నగర శివార్లలో నడుచుకుంటూ వారి వారి గ్రామాలకు వెళుతున్న వారికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇంకెవరికైనా వైద్య సహాయం అవసరమైన కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

సోమవారం విశ్వహిందూ పరిషత్ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి  రాఘవులు , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  రామ రాజు , రాష్ట్ర కార్యదర్శి  బండారి రమేష్  (మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి వలస వచ్చిన) పలువురు కార్మికులకు భాగ్యనగర్ లోని అత్తాపూర్ దగ్గర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇంకెవరికైనా ఎటువంటి సహాయం అవసరం ఉన్నా.. విశ్వహిందూ పరిషత్ కార్యాలయాన్ని సంప్రదించాలని వారు సూచించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సరుకులు, ఆహారం, నిత్యవసర వస్తువులు అందించేందుకు విశ్వహిందూ పరిషత్ నుంచి ఏడు వాహనాలకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. ఈ వాహనాల్లో తిరుగుతూ వారి వారి అవసరాలు తీర్చడానికి కార్యకర్తలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ సేవా కార్యక్రమాలను విశ్వహిందూ పరిషత్ ప్రాంత సహ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ స్టేట్ కో కన్వీనర్ శివరాములు పర్యవేక్షణ చేస్తున్నారు. వారికి తోడుగా విశ్వహిందూ పరిషత్ మహా నగర అధ్యక్షులు శ్రీనివాస రాజా గారు సహాయం అందిస్తున్నారు.

దాతలు సహకరించండి :: బండారి రమేష్

అన్ని జిల్లా కేంద్రాలు, ప్రకండ కేంద్రాలు, గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో లీనం కావాలని  రాష్ట్ర కార్యదర్శి  బండారి రమేష్  కోరారు. జనతా కర్ఫ్యూ లో ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించ కుండా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎవరికి ఏం అవసరమో, వాటిని తీర్చేందుకు క్షేత్రస్థాయిలో బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో సమాజానికి కి సహాయం అందించేందుకు కార్యకర్తలు అన్ని విధాలా ముందు ఉండాలన్నారు.  అంతర్జాతీయ కమిటీ ఆదేశాల మేరకు కార్యకర్తలు నడుచుకోవాలని చెప్పారు. ముఖ్యంగా సేవా కార్యక్రమాలకు అవసరమయ్యే వనరులను సమకూర్చేందుకు దాతలు ముందుకు రావాలని రమేష్ గారు విజ్ఞప్తి చేశారు. వస్తు రూపేనా, నగదు రూపేణా వి హెచ్ పి కి సహకరించాలని కోరారు.

మందుల పంపిణీ..

అశ్వినీ హెయిర్ ఆయిల్ అధినేత సుబ్బారావు గారు అందించిన మందులను ఆయా ప్రాంతాల్లో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. హోమియోపతి వైద్యం చే తయారుచేసిన మాత్రలను వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని… కరోనా లాంటి వైరస్ సోకే ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలున్నాయని అశ్విని సుబ్బారావు గారు వివరించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే లక్షల సంఖ్యలో ప్రజలకు మాత్రలు పంపిణీ చేశామని చెప్పారు. ఈ మాత్రలు అవసరమైన వారు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. రోడ్ల వెంబడి పోలీసులతోపాటు కనిపించిన వారికల్లా కాలనీలు, గ్రామాల్లోని వారికి  వారు మందులను పంపిణీ చేస్తున్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami