భారత్‌లో 10 శాతం కరోనా కేసులు రికవరీ… క్లాప్స్ కొడదామా…

334

ప్రపంచ దేశాల్లో కరోనా సోకి ఎక్కువ మంది చనిపోతుంటే… భారత్‌లో మాత్రం కేసుల రికవరీ ఎక్కువగా జరుగుతోంది.

కేంద్ర ఆరోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం… ఇండియాలో… మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 1024 నమోదవ్వగా… వాటిలో… 96 కేసులు రికవరీ అయ్యాయి. కొన్ని కేసుల్లో పేషెంట్లను డిశ్చార్జి కూడా చేశారు. ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కరోనా నుంచీ బయటపడిన ఏడుగురిని డిశ్చార్జి చేస్తామని తెలిపింది. తద్వారా రికవరీ కేసుల సంఖ్య మరింత పెరుగుతుంది. కరోనాపై పోరాటంలో భాగంగా దేశం మొత్తం లాక్‍డౌన్ అయిన ఈ రోజుల్లో… ఇలాంటి మంచి వార్త వినడం అందరికీ ఆనందకరమే.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారిలో… 82 శాతం మంది రికవరీ అవుతున్నారు. మిగతా 18 శాతం మంది చనిపోతున్నారు. ఐతే… భారత్‌లో మరణాల సంఖ్య అత్యంత తక్కువగా ఉంది. అంటే… మొత్తం కేసులతో పోల్చితే… దాదాపు 2.5 శాతం (27 మంది మృతులు)గా ఉంది. ప్రపంచ శాతాలతో పోల్చితే… ఇది చాలా చాలా తక్కువ. ఇండియాలో అంతగా వైద్య సదుపాయాలు లేనప్పటికీ… డాక్టర్లు, నర్సులూ, వైద్య సిబ్బంది… కరోనా వైరస్ నుంచి ప్రజలను ఇంత బాగా కాపాడుతుండటం గొప్ప విషయమే.

లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం… అన్ని రాష్ట్రాల, జిల్లాల సరిహద్దులనూ మూసేయాలని ఆదేశించింది. పైగా లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చెయ్యాలని ఆర్డరేసింది. కాబట్టి… వచ్చే రెండు వారాల్లో కేసుల రికవరీ మరింత పెరిగే ఛాన్సుంది. ఈ కారణంగానే… ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు ఉండదనే కాన్ఫిడెన్స్‌తో సీఎం కేసీఆర్ ఉన్నారు.

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నా… రికవరీ అయ్యే కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటం వల్ల… వైరస్‌ను పూర్తిగా కంట్రోల్ చెయ్యగలమనే నమ్మకం డాక్టర్లకు కలుగుతోంది. ప్రస్తుతానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి మందులు, మంచి ఆహారం, ఎక్కువ విశ్రాంతి ఇవ్వడం ద్వారానే బాధితులు కోలుకునేలా చెయ్యగలుగుతున్నారు. ఇలాగే మున్ముందు కూడా పటిష్ట చర్యలు చేపడితే… కరోనా శని భారత్‌కి వదిలిపోతుందని అనుకుంటున్నారు. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమవుతోందని అంటున్నారు.