* పోలీసులు అంటే అసలు మనలో చాలా మంది ఇష్టపడరు ఎందుకని …?

* విశ్వసించరు దేనికని ..?

* వాళ్ళు లేనిదే మనం రోడ్డు పైకి రాగలమా …?

* పోనీ కనీసం మన ఇంట్లో ప్రశాంతంగా నిదురించగలమా …?

* మన ఇంట్లో ఆడాళ్ళను బజారుకు సరుకులకు పంపించగలమా …?

* మన పిల్లలను పాఠశాలలకు పంపించగలమా ….?

* మరి పోలీస్ అంటే ఎందుకీ వివక్ష ….? ఎందుకంత భయం ….? మన ప్రియమిత్రుడు పోలీస్ ….!!

పాఠశాలనుంచీ సమయానికి రావాల్సిన పిల్లలు ఇంటికి రాకపోతే ‘ పోలీస్ ‘ …!

వయసుకొచ్చిన అమ్మాయి తన సహచర స్నేహితురాలి ఇంటికి వెళ్లి రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ అయ్యి ఇంటికి రావడం కాసేపు ఆలస్యమయితే ‘ పోలీస్ ‘…!

ఇంటి బయట మన బైక్ గానీ / పెంపుడు కుక్క గానీ కనబడక పోతే ‘ పోలీస్ ‘ ….!

అత్యధిక వడ్డీలకు ఆశపడి మోసపూరిత చిట్ ఫండ్ కంపెనీ ల లో డబ్బు జమా చేసిన తరువాత వాళ్ళు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేస్తే ‘ పోలీస్ ‘ …?

మనకి రోడ్డు పైన ప్రమాదం జరిగితే ‘ పోలీస్ ‘ ….!

మనకి అసౌకర్యం గా ఉంటే ‘ పోలీస్ ‘ ….!

మనకి అన్యాయం జరిగితే ‘ పోలీస్ ‘…!

మనకు భయమేస్తే ‘ పోలీస్ ‘ ….!

కానీ మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఏనాడైనా మనం స్థానిక ‘ పోలీస్ ‘ గారికి ఆహ్వాన పత్రిక ఇస్తున్నామా …?

మనం ఇంట్లో దసరా పండుగ కు నాటు కోడి కోసుకుని / ఆ కూరను చిల్లి గారెలతో నంచు కుంటున్నప్పుడు గానీ / కొత్త సినిమా టిక్కెట్లలో ఒకటి మిగిలిపోతప్పుడు గానీ అదే పోలీస్ ని మన దగ్గరకు పిలిచి వారితో స్నేహపూర్వకం గా సమయాన్ని పంచుకుంటున్నామా …?

మరి ఆ పోలిసాయనకు మన ఇంటికి పిలిచి ఇస్తరాకేసి భోజనం పెడుతున్నామా ….? మన పక్కనే ఆయనను కూర్చోబెట్టుకుని సరదా గా ఆయనతో చలనచిత్రాన్ని వీక్షిస్తూ స్నేహభావాన్ని పంచుకుంటున్నామా …?

మరి పోలీస్ అంటే ఎందుకీ వివక్ష ….?
ఎందుకంత భయం ….?

మన ప్రియమిత్రుడు పోలీస్ …!

వ్యవస్థలో ఎక్కడో ఎవరో ఏదో చిన్నపాటి పొరపాటు చేశారని యావ త్ పోలీస్ వ్యవస్థనే తప్పుగా అర్ధం చేసుకుని మనం కోల్పోతున్నది ఇంతా – అంతా కాదు మిత్రమా …!

మీరూ – నేను మంచివారంటే టక్కున నమ్మేది ఎంత మంది …? అదే ‘ చెడ్డవారిమి ‘ అంటే వెంటనే …. అవునా …?అయ్యుండొచ్చులే అని తలూపే సమాజం లో బ్రతుకుతున్నాం మనం . ఒక అధికారి మంచివాడూ అంటే నమ్మడానికి చాలా సమయం తీసుకుంటూ ఆలోచిస్తున్న మనం / అదే అధికారి చెడ్డవాడూ అంటే వెంటనే అయిఉండొచ్చు అని పరోక్ష అంగీకారాన్ని మద్దతుగా ప్రకటించేస్తున్నాం . ఇది మన తప్పిదం అని ఎంత మంది నిజాయితీగా ఒప్పుకోగలరు .

ఏ దేశానికైనా… పోలీసే దేవుడు

సరిహద్దు లు మొద లు కొని ఇంటి గడపవరకు …!

సామాన్యుడి కనురెప్ప… ‘ పోలీస్‌ ‘ ….!

అసలు పోలీస్ అంటే ఏంటోఎంతమందికి తెలుసు …?

వారు పడే భాధ ఏంటో / మానసిక క్షోభఎలా ఉంటుందో ఎందరికి తెలుసు …?

’’ పోలీస్ ‘’ …!

అంటే కొత్తగా పరిచయంఅక్కర్లేని ప్రియమిత్రుడి హోదా అది.
సమాజంలోని ప్రతి ఇంటి చుట్టూపాతుకుపోయి ఉండే
కనబడని కంచె … ‘పోలీసే‘ ..! అలాంటి పోలీస్‌ గురించిఇప్పుడు కొంచెం భిన్నం గా చెప్పా లనేది మాకోరిక .

కానీ ఎలా చెప్పగలమన్న సందిగ్ధం.నిత్యమూ కళ్ల ముందు కనిపించే ఖాకీ డ్రెస్‌గురించి కొత్తగా వివరించడానికి ఏంఉంటుంది …?
కానీ ఉంది చెప్పేస్తున్నాం ….!

కొన్ని బాధాకరమైన జ్ఞాపకాల్ని, గర్వపడేగుర్తుల్ని ఇప్పుడు చెప్పుకుందాం . తరువాత రొమ్ము విరుచుకున్న పొగరైన ఘట్టాల్నికూడా చెప్పేసుకుందాం . అవసరంకాకపోయినా ఇక్కడో సినిమా సన్నివేశాన్నిఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి.
తమకు ఎదురవుతున్న అవమానభారాన్నితట్టుకోలేని
స్థితిలో…

‘మేం మూకుమ్మడిగా సె లవుపెడుతున్నాం…’ అంటూ….

ఆ నగరం లోనిపోలీసు లంతా జనమ్మీద నిరసనప్రకటిస్తారు. నిజం గానే కొన్ని గంటల పాటువిధుల కు దూరం గా ఉండిపోతారు.

ఊరంతా ఆరాచకం ప్రబలిపోతుంది. ఆతర్వాత ఏదో జరుగుతుంది… మళ్లీ ఖాకీ లు ప్రజారక్షణ నిమిత్తం డ్యూటీ లకుహాజరవుతారు. సినిమా కదా …?
అందులోఇదో సన్నివేశం.

కానీ నిజ జీవితం లో అలా జరిగితే..?

స్కూళ్లకు దసరా సెలవు లు ఇచ్చినట్లుపోలీస్‌ స్టేషన్ల మెయిన్‌ గేట్ల కు ఓ పది రోజు లు పాటు తాళా లు పడితే …? రోడ్డు మీదఒక్క ట్రాఫిక్‌ పోలీస్‌ కూడా తెల్ల డ్రెస్సు లోకనిపించ కుండా ఉంటే..?

యూనిఫారాలు పక్కన పెట్టేసి పోలీసు లందరూ తమకుటుంబాల తో ఇళ్లలోనే కూర్చుండిపోతే…?

వాళ్ల కు మాత్రం ఉండదా…?
ఇంటి ఇల్లాలి తో వేడి వేడిగా పకోడీలు వేయించుకుని ,వాటిని ఆరగిస్తూ కూతుర్ని ఒళ్లోకూర్చోబెట్టుకుని టీ వీ లో మంచి కార్టూన్‌మూవీ చూడాలన్న కోరిక ఉండదా…? భార్య తో వైజాగ్ రుషికొండ బీచ్‌ ఇసుకలో నో / హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ గట్టుపై నో నడుస్తూ కాల్చిన మొక్కజొన్నకండి లను తింటూ కబుర్లు చెప్పుకోవా లని…? కానీ మనల్ని విడిచి అలాచేస్తున్నారా …? పూర్తి గా ఇంటి కేఅంకితమైపోగలుగుతున్నారా…? పొద్దున్నఇంటి నుంచి బయటకు వచ్చేటపుడునిద్రలేవని తమ మూడేళ్ల బుడ్డోడు రాత్రిపొద్దుపోయిన తర్వాత మళ్ళీ ఇంటికెళ్లాకకూడా తనతో ఊసులాడకుండానిద్రపోతున్నాడన్న ఆవేదన బయటకుపోలీస్ లో ఎక్కడైనా మనకు కనిపిస్తుందా…?

పోలీస్ అనేవాడు తన బాధనుకనిపించనివ్వడు . ఎందుకంటే ….

*పోలీస్ కంట్లో చెమ్మ కనబడితే అదిసమాజానికి అరిష్టం కాబట్టి *..!

ఆ బాధనంతాతన గుండెల్లోనే దాచుకుంటూ , లోకకళ్యాణం కోసం పరమ శివుడు తన కంఠం లోవిషం దాచుకుని ఎలా ” ఘరళకంఠుడు ”అయ్యాడో …అదే కోవలో తమ వ్యక్తిగతబాధనంతా తమ ఖాకీ యూనిఫామ్ వెనుకఉన్న తన ‘ గుండె నరాల్లో ‘ దాచుకునిసమాజానికి సరదా గా కన బడుతుంటాడు .

ఇలాంటి ఎన్నెన్నో భావోద్వేగాలూ ,రాగధ్వేషాలను బలవంతం గా పక్కనపెట్టక తప్పని ఏకైక ఉద్యోగం… పోలీస్‌.

ఖాకీ యూనిఫారం అత్యంతగౌరవప్రదమైనది. ఇదే యూనిఫారాన్ని ఆర్టీసీకార్మికులే కాకుండా మరో ఇతర ప్రభుత్వసంస్థలలో పనిచేస్తున్న వారూ ధరించవచ్చు.కానీ పోలీస్‌ యూనిఫారం లెక్క వేరు.

అది సమాజానికి ఇనుప కవచం. దేశసరిహద్దుల కు పెట్టని కోట గోడ .

చివరిగా ఒక మాట మిత్రమా …. పోలీసులు లేనిదే మనం బ్రతకలేం . క్రూరమృగాలు ఆధునికం గా తిరుగుతున్న ఈ హైఫై యుగం లో మనం పోలీస్ లను విస్మరిస్తే చాలా ఇబ్బంది పడిపోతాం . అందుకని వారిని ప్రేమిద్దాం . మనసులో మాటలను పంచుకుందాం . మన కుటుంబం లో ఒక సభ్యునికా కాకపోయినా మన ప్రియా మిత్రునిగా చేసుకుందాం . మనకోసం ప్రాణాలు అర్పించడానికి సహితం మన తల్లిదండ్రులు కానీయండి / పిల్లలు కానీయండి లేక జీవితం పంచుకున్న భాగస్వాములు కానివ్వండి ఒక్క నిమిషం ఆలోచిస్తారు . కానీ మనతో ఏ బంధమూ లేకపోయినా ప్రాణాలు మాత్రం అర్పించాలంటే ముందువరుస లోనికి వచ్చి నేనున్నానంటూ రొమ్ము విరిచేదే ‘ పోలీస్ ‘ . అటువంటి ‘ పోలీస్ ‘ ని ప్రేమిద్దాం మిత్రమా … మహా అయితే పోయేదేముంది కాస్త సమయం తప్పా ……

-లక్ష్మీపతి రాయల్

By RJ

Leave a Reply

Close Bitnami banner