కేశినేని ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్

1
27

ఏపీ ఎంపీ ట్వీట్‌కు సానుకూలంగా స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్
విజయవాడ లారీ డ్రైవర్లు తెలంగాణలో చిక్కుకున్నారని కేశినేని ట్వీట్

వెంటనే ఆహారం, వసతి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి
‘మేము వారికి సాయం చేస్తాం ఎంపీ గారూ’ అన్న కేటీఆర్‌

విజయవాడ పార్లమెంట్ కు చెందిన కొందరు లారీ డ్రైవర్లు తెలంగాణలోని మెదక్ జిల్లా, తూప్రాన్ మండలం మనోరాబాద్ గ్రామం సీసీఐ గోడౌన్స్ లో చిక్కుకుని నీరు, ఆహారం లేకుండా అలమటిస్తున్నారంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

‘మేము వారికి సాయం చేస్తాం ఎంపీ గారూ’ అని కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. వారిని ఆదుకోవాలని కేటీఆర్‌ ఆఫీస్‌, మెదక్‌ జిల్లా కలెక్టర్లకు ఆయన సూచనలు చేశారు. కాగా, ట్విట్టర్‌లో లారీ డ్రైవర్ల ఫోన్ నంబర్లు, ఫొటోలను కూడా కేశినేని నాని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

1 COMMENT