హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో ఇవాళ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి కట్టడిపై సీఎం సమీక్షిస్తున్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. సామాజిక దూరాన్ని కూడా పాటించి.. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు.

By admin

Leave a Reply

Close Bitnami banner