యజమానునులతో ఫలించిన మంత్రి చర్చలు
అసలు ఒత్తిళ్లు పోలీసుల నుంచేనట
వాళ్లే ఒత్తిడి చేశారన్న హాస్టల్ యజమానులు
తలసాని జోక్యంతో మళ్లీ తెరచుకున్న హాస్టళ్లు
సరుకులకు పాసులు ఇవ్వాలని పోలీసులకు ఆదేశం
స్వయం నియంత్రణ పాటించాలని విద్యార్ధులకు హితవు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో నెలకొన్న హాస్టల్ విద్యార్ధులు, బ్యాచిలర్ల సమస్యకు తెలంగాణ
సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెరదించారు. కరోనా కారణంగా దీర్ఘకాలిక
సెలవులివ్వడం, తాము ఉంటున్న హాస్టళ్లను ఖాళీ చేయాలని యజమానులు ఆదేశించడంతో..
విద్యార్ధులు, బ్యాచిలర్లయిన ఉద్యోగులు సతమతమయ్యారు. అమీర్‌పేట, సంజీవరెడ్డినగర్,
వెంగళరావునగర్‌లో ఉన్న, దాదాపు వంద హాస్టళ్ల విద్యార్ధులంతా ఏపీకి వెళ్లేందుకు
ప్రయత్నించారు. అయితే,  అది జగ్గయ్యపేట గరికపాడు చెక్‌పోస్టు వద్ద వివాదం సృష్టించిన
విషయం తెలిసిందే.

తలసాని జోక్యంతో మళ్లీ తెరచుకున్న హాస్టళ్లు

దీనితో నూజివీడులో ఏర్పాటుచేసిన క్వారంటైన్లకు వెళ్లడం ఇష్టం లేని వారంతా, తిరిగి హైదరాబాద్‌కు వెనక్కివచ్చారు. అయితే వాళ్లకు తిరిగి హాస్టళ్లలో ప్రవేశం లేకపోవడంతో, తలదాచుకునే వీలు లేక నానా పాట్లు పడ్డారు. అలాంటి వారికి జీహెచ్‌ఎంసీ 5 రూపాయల భోజనం ఏర్పాటుచేస్తుందని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.  ఈ విషయం తెలుసుకున్న సనత్‌నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హుటాహుటిన రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్‌తో కలసి, వందమంది హాస్టల్ యజమానులు, సంజీవరెడ్డినగర్ పోలీసులతో యుద్ధప్రాతిపదికన సమావేశం ఏర్పాటుచేశారు.ఈ క్లిష్ట పరిస్థితితో హాస్టళ్లలో ఉండేవారిని ఖాళీ చేయమని ఒత్తిడి చేయడంపై, తలసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రభుత్వానికి సహకరించకుండా, సమస్యలు సృష్టించడం ఏమిటని క్లాసు తీసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురాకుండా, ఇంత సున్నితమైన అంశంలో ఏకపక్ష నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని తలంటారు.

వాళ్లే ఒత్తిడి చేశారన్న హాస్టల్ యజమానులు

తలసాని ఆగ్రహాన్ని గ్రహించిన హాస్టల్ యజమానులు, అసలు విషయాన్ని బయటపెట్టారు. వారు హాస్టళ్లలో ఉండటం వల్ల తమకేమీ నష్టం లేదని, అయితే స్థానిక పోలీసులు ఒత్తిడి చేయడం వల్లే ఖాళీ చేయించాల్సి వచ్చిందని తలసాని, మాగంటి దృష్టికి తీసుకువెళ్లారు. వారిని హాస్టళ్లలో ఉండనిస్తామని, అయితే భోజన ఏర్పాట్ల కోసం, కావలసిన సరుకులు తీసుకునేందుకు బయటకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.దీనితో, అసలు సమస్య తెలుసుకుని , హాస్టళ్ల యజమానులు సరకులు తెచ్చుకునేందుకు, పాసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

స్వయం నియంత్రణ పాటించాలని విద్యార్ధులకు హితవు

తర్వాత, అక్కడికి వచ్చిన హాస్టల్ విద్యార్ధులు, బ్యాచిలర్ ఉద్యోగులకూ క్లాసు ఇచ్చారు. కరోనా తీవ్రత కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాటించాలన్నారు. స్వయం నియంత్రణతోనే కరోనాను నివారించగలమని చెప్పారు. తాను పోలీసులకు తగిన సూచనలు ఇచ్చామని, ఇకపై మీకు ఎలాంటి సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. హాస్టళ్ల వద్ద 5 రూపాయల భోజనం ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. దీనితో వారంతా తలసానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తలసాని

అనంతరం మంత్రి తలసాని.. మాజీ మంత్రి  దానం నాగేందర్,  ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్, ఎమ్మెల్యే,  కార్పొరేటర్ నామన శేషుకుమారితో కలసి.. అమీర్‌పేటలో అక్షయపాత్ర-జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసిన ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు, 10 వేలమందికి నగరంలోని 80 ప్రాంతాల్లో ఉచిత భోజన సెంటర్లు ఏర్పాటుచేశామని తలసాని చెప్పారు.

మార్కెటింగ్ అధికారులపై మండిపాటు

తర్వాత ఎర్రగడ్డ రైతుబజార్‌ను సందర్శించారు. మార్కెట్‌లో పారిశుధ్య పనులు, సక్రమంగా నిర్వహించని మార్కెటింగ్ అధికారులపై విరుచుకుపడ్డారు. వ్యాపారులు దూరం పాటించాలని, కూరగాయల ధరల బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తర్వాత యూసుఫ్‌గూడలోని రత్నదీప్ సూపర్‌మార్కెట్‌ను తనిఖీ చేశారు. అక్కడి వస్తువుల ధరలను వాకబు చేశారు. రైతుబజార్ ధరల కంటే, రత్నదీప్ ధరలు ఎక్కువగా ఉండటంపై, యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా లాభాపేక్షతో వ్యాపారం చేస్తే ఎలా అని క్లాసు ఇచ్చారు. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య వివాదం సృష్టించిన హాస్టల్ సమస్య పరిష్కరించడంతోపాటు, రైతుబజార్, ప్రైవేటు మాల్స్‌లో ధరల పెంపుపై తలసాని దృష్టి సారించారు.

By admin

4 thoughts on “తలసాని చొరవతో తెలంగాణలో హాస్టళ్ల సమస్యకు తెర!”
  1. […] తలసాని శ్రీనివాసయాదవ్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలంగాణ సీనియర్ మంత్రుల్లో ఒకరైన తలసాని, ఇప్పుడు కరోనా పరిస్థితిలో ప్రభుత్వపక్షాన అత్యంత చురుకుగా వ్యవహరిస్తున్నారు. సాధారణ సమయంలో చురుకుగా పనిచేసే ఆయన, ఈ విపత్తు సమయంలో శరవేగంగా పనిచేస్తున్నారు. కరోనా సమయంలో రోడ్లపైకి వచ్చి, ప్రభుత్వ నిర్ణయాలు స్వయంగా పర్యవేక్షిస్తున్న నలుగురైదురు మంత్రుల్లో తలసాని ఒకరు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, ఆయన తన ప్రాణాలు పణంగా పెట్టి  నీళ్లలో తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. భారీ వర్షాలతో బస్తీలు జలమయం అయినప్పుడు కూడా వర్షంలో తడుస్తూనే, అధికారులతో కలసి బస్తీలను సందర్శించిన రోజులూ లేకపోలేదు. ఏదైనా విపత్తు వస్తే, ముందుగా ఆయన అప్రమత్తమయి, అధికారులను పరుగులు పెట్టించి అక్కడికక్కడే సమీక్షలు నిర్వహించే అలవాటున్న తలసాని.. కరోనా సమయంలో అదే విధానం కొనసాగిస్తుండటం విశేషం. ఇదికూడా చదవండి.. ‘తలసాని చొరవతో తెలంగాణలో హాస్టళ్ల సమస…’ […]

  2. […] లాక్‌డౌన్ నేపథ్యంలో, నగరంలో ఉన్న వలస కూలీలు, మూత పడిన హాస్టల్ విద్యార్ధులు ఆకలితో అల్లాడకూడదన్న లక్ష్యంతో, మంత్రి కేటీఆర్ అన్నపూర్ణ క్యాంటీన్లను పునరుద్ధరించారు. దానితోపాటు 342 మొబైల్ క్యాంటీన్లు సమకూర్చారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చొరవతో, ఈ క్యాంటీన్లే.. ఇటీవల ఏపీ వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చిన విద్యార్ధులు, ఉద్యోగులను ఆదుకున్నాయి. అప్పటినుంచి ఇప్పటివరకూ 41లక్షల 41 వేల మందికి ఆహారం అందించడం గొప్ప విషయం. ఇదికూడా చదవండి.. తలసాని చొరవతో తెలంగాణలో హాస్టళ్ల సమస… […]

  3. […] అదేదో సామెత చెప్పినట్లు.. పుణ్యానికి పోతే పాపం ఎదురయినట్టయింది మంత్రి తలసాని పరిస్థితి. సహజంగా ఏ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి, దానిపై చర్చలు జరిపే అలవాటున్న ఆయన సినిమా సమస్యలపైనా దృష్టి సారించారు. గతంలో వలస కార్మికులకు రైళ్ల విషయంలో కూడా తలసాని చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఇదికూడా చదవండి.. ‘నెరవేరిన తలసాని డిమాండ్’ అగ్రహీరోల అధిపత్యపోరులో మంత్రి నలుగుతున్నట్లు కనిపిస్తోంది.  సినిమా పరిశ్రమ క్లిష్ట పరిస్థితిలో ఉందని, కార్మికులు తిండిలేక అల్లాడుతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలకు స్పందించిన తలసాని తన సొంత ట్రస్టు ద్వారా తనయుడు సాయికిరణ్‌తో కలసి, వారికి నిత్యావసర వస్తువులు అందించారు. ఇదికూడా చదవండి.. ‘తండ్రిని మించిన తనయుడు తలసాని సాయి కిరణ్’ తర్వాత అదే అంశంపై సినీపెద్దలతో చర్చలకు అంగీకరించారు. బాలకృష్ణ హీరో కమ్ పొలిటీషియన్ కాబట్టి బిజీగా ఉంటారు. చిరంజీవి, నాగార్జున పెద్ద హీరోలయినా వారికి ఇప్పుడు సినిమాల్లేవు కాబట్టి ఖాళీగానే ఉన్నారు. పైగా చిరంజీవికి పరిశ్రమలో కొంత పెద్దరికం ఉంది. ఇలాంటి లెక్కలతో చ ర్చలకు వెళ్లిన తలసాని.. ‘సినిమా కథలు’, ‘హీరోల వేషాలు’ చూసి తలపట్టుకోవలసి వచ్చింది. చివరకు ఆయనే ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇదికూడా చదవండి.. తలసాని చొరవతో తెలంగాణలో హాస్టళ్ల సమస… […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner