కరోనా భారత్‌పై ‘నిర్మలా’ హృదయుం

నిర్మలా సీతారామన్ ప్రకటనతో బడుగుజీవికి ఊరట
పేదలను ఆదుకునేందుకు లక్షా 75 వేల ప్యాకేజీ
రోజువారీ బతుకులకు మోదీ సర్కారు బాసట
రైతులు, వృద్ధులు, వుహిళలు, కార్మికులకు ఆర్ధిక భరోసా
ఈఎంఐల వాయిదా, కనీస ఆదాయు ప్రకటన, వడ్డీల రుణమాఫీలపై నిరాశే
(మార్తి సుబ్రహ్మణ్యం)
నిర్మలా సీతారామన్ ప్రకటనతో బడుగుజీవికి ఊరట
కల్లోల కరోనా ఫలితంగా విధించిన కర్ఫ్యూలో చిక్కుబడిపోయిన బడుగు జీవులకు నరేంద్రమోదీ
సర్కారు ఎట్టకేలకు భరోసా ఇచ్చింది. కర్ఫ్యూ వల్ల ఆదాయం కోల్పోయిన వర్గాలకు బాసటగా
నిలుస్తూ, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ.. ఆయా వర్గాల
పెదవులపై చిరునవ్వులు పూయించింది. కానీ, మధ్య తరగతి జీవి ఆశించినవేమీ ఆమె
ప్రకటనలో కనిపించకపోవడం నిరాశపరిచింది.
పేదలను ఆదుకునేందుకు ప్యాకేజీ ప్రకటించిన నిర్మలా సీతారామన్
లాక్డౌన్ విధించిన నేపథ్యంలో.. కింది స్థాయి వర్గాల రోజువారీ అవసరాలు, ఆహార అవసరాల
కోసం ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం.. రు. 1.70 లక్షల కోట్లు ప్రకటించడం ఊరటనిచ్చింది.
రోజువారీ సంపాదనతో పొట్టపోసుకునే కింది తరగతి జీవులకు, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
చేసిన ప్రకటన కచ్చితంగా మేలు చేసేదే. లాక్డౌన్ మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం
ఉన్నందున, ఎలా జీవించాలో తెలియక బెంగ పట్టుకున్న కల్లోల భారత్‌పై.. ‘నిర్మల’ హృదయుం
చూపి, చేసిన ప్రకటన మరికొద్దిరోజులు తమ బతుకులపై భరోసా నింపేలా చేసింది. ప్రధానంగా
వృద్ధులు, గ్రామీణాభివృద్ధి కోసం పనిచేసే కూలీలకు ప్రకటించిన ప్యాకేజీ లబ్థిదారులను
మెప్పించింది.
కరోనా కల్లోల ఫలితంగా, కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ వల్ల నష్టపోయే బడుగు వర్గాలకు వివిధ
రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక వరాలు ప్రకటించాయి. అయితే, ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం
మాత్రం ఎలాంటి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించకపోవడం విమర్శలకు దారితీసింది. దీనితో రంగంలోకి
దిగిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, గత రెండురోజుల నుంచీ ఆర్ధిక ప్యాకేజీపై
కసరత్తు ప్రారంభించారు. ఆ ప్రకారంగా దానిని గరీబ్ కల్యాణ్ స్కీమ్ పేరుతో రూ.1.70లక్షల
కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు గురువారం వెల్లడించారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో,
ఖాళీ జేబులతో ఉండకూడదన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యమని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని
కరోనాపై ఏర్పాటుచేసిన ఎకనమిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశించినట్లు నిర్మలా సీతారామన్
వివరించారు.
రోజువారీ బతుకులకు మోదీ సర్కారు బాసట
ఆ ప్రకారంగా.. దేశంలో వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించారు. శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ప్రత్యేక బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కరోనా సమయంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి ప్యాకేజీ ప్రకటించడం అభినందీయమే. రానున్న మూడు నెలలకు ఒక్కొక్కరికి, నెలకు రూ.5కేజీల బియ్యం పంపిణీ, కుటుంబానికి కిలో చొప్పున పప్పులు అందిస్తామని, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం చేస్తామని వెల్లడించారు.
రైతులు, వృద్ధులు, వుహిళలు, కార్మికులకు ఆర్ధిక భరోసా
డ్వాక్రా బృందాలకు రుణపరిమితి రూ.10లక్షలకు పెంచి, ఎలాంటి పూచీకత్తు లేని రుణాలు అందిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటన, మహిళల పెదవులపై చిరునువ్వులు పూయించేదే. దీనిద్వారా 63 లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ధి చేకూరడమే కాకుండా, దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకు మేలు చేకూరుతుంది. ఉపాధిహమీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంచుతున్నామని, ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందచేయనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
నిర్మలా సీతారామన్ తన ప్యాకేజీలో రైతులనూ చేర్చారు. దేశంలోని 8.69 కోట్ల మంది రైతులకు 2 వేలు చొప్పున, నగదు బదిలీ ద్వారా తక్షణమే ఇస్తామన్నారు. ఏప్రిల్ తొలి వారంలో రైతుల ఖాతాలో, ఈ మొత్తం బదిలీ అవుతుందని వెల్లడించారు. 3 కోట్ల మంది వృద్ధులు, దివ్యాంగులు, పించనుదారులకు, రెండు విడతలో అదనంగా వెయ్యి రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. జన్‌ధన్ ఖాతాలున్న 20 కోట్ల మంది మహిళలకు, నెలకు ఐదువందల చొప్పున, వచ్చే 3 నెలల పాటు పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు.
నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీలో ఈపీఎఫ్ చందాదారులు కూడా ఉండటం విశేషం. రూ.15వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందా, కేంద్రమే భరిస్తుందని చెప్పారు. ఉద్యోగి వాటా, యజమాని వాటాను కలిపి, ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుందని, అయితే వంద మందిలోపు ఉద్యోగులు ఉన్న సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. ఆ వంద మంది ఉద్యోగుల్లో 90 శాతం మంది రూ. 15 వేలులోపు జీతం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా, 75 శాతం వరకు పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చని వెల్లడించారు. మూడు నెలల జీతం లేదా, 75 శాతం పీఎఫ్‌లో ఏది తక్కువైతే దాన్ని, ఉపసంహరించుకోవచ్చని వివరించారు.
దేశంలోని భవన నిర్మాణ కార్మికులకూ, నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. దేశంలో 3.5 కోట్ల మంది నమోదిత భవన నిర్మాణ కార్మికులు ఉండగా, వారి సంక్షేమానికి రూ.31 వేల కోట్ల నిధి ఇప్పటికే ఉందని చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో వారి అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగిస్తామన్నారు. రాష్ట్రాలు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్‌ను వినియోగించుకోవాలని కోరారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాథి హామీ పథకం కింద ఒక్కో కార్మికుడికి 2 వేలరూపాయలు పెంచుతున్నట్లు ఆమె వెల్లడించారు..
ఈఎంఐల వాయిదా, కనీస ఆదాయు ప్రకటన, వడ్డీల రుణమాఫీలపై నిరాశే
అయితే, అంతా బాగానే ఉన్న్పటికీ.. మధ్య తరగతి జీవులు ఎదురుచూస్తున్న అంశాలేవీ, నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీలో లేకపోవడం నిరాశపరిచింది. ముఖ్యంగా సంస్థలు, షాపులు, చిత్త తరహా పరిశ్రమలు మూతపడినందున.. నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐలను, మూడు నెలల పాటు వాయిదా వేయాలన్న డిమాండ్‌పై, కేంద్రం స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అదేవిధంగా వాహనదారులపై రుణాల వడ్డీని మూడునెలల పాటు మాఫీ చేయాలని, ఆరు నెలల పాటు అన్ని రకాల రుణవాయిదాలు నిలిపివేయాలన్న, సగటు తరగతి వర్గ ఆకాంక్షలు కేంద్రం నెరవేర్చలేదు. కనీస ఆదాయ ప్రకటనపైనా, కేంద్రం సానుకూలంగా స్పందించలేదని కాంగ్రెస్ విమర్శించింది. ఇప్పటి పరిస్థితిలో 4 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ అవసమని, ఆర్ధిక శాఖ మాజీ మంత్రి చిదంబరం డిమాండ్ చేశారు.
Great write-up, I’m normal visitor of one’s website, maintain up the excellent operate, and It’s going to be a regular visitor for a lengthy time.