నారా చంద్రబాబు నాయుడు ఉత్తరం

340

గౌ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి,
అమ్మా,

విషయం.: కరోనా వైరస్ విస్తృతిపై భయాందోళనలు-ప్రజల్లో ఆందోళన తొలగించేందుకు తక్షణ చర్యలు-భౌతిక దూరం పాటించడం, సంఘీభావం పెంపొందించడం-నిత్యావసరాల పంపిణీ వికేంద్రీకరణ-శానిటైజర్లు, మందులు తదితరాల గురించి

*
కరోనా మహమ్మారి దుష్ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తిపైనా పడింది. భారతదేశం కూడా కరోనా బాధిత దేశంగా మారింది, దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయంపు ఏమీ లేదు. కాబట్టి మనం అందరం ఈ మహమ్మారిని సమర్ధంగా ఎదుర్కోవడంలో సమష్టిగా పోరాడాల్సిన సందర్భం ఇది.
కరోనా విస్తరణను అరికట్టేందుకు పాటించాల్సిన భౌతిక దూరానికి వ్యతిరేకంగా మార్చి 24న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం రైతు బజార్ లో జనాన్ని సామూహికంగా గుంపులుగా ఒకేచోటకు అనుమతించడం జరిగింది. కేంద్రప్రభుత్వం 3వారాలపాటు(ఏప్రిల్ 14వరకు) పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది, ఈ కాలానికి సరిపడా బియ్యం మరియు గోధుమలు ప్రత్యేక రేషన్ గా పంపిణీ చేయనుంది.
లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసరాల కొరత అనేది ప్రధాన సమస్య, ప్రజల్లో భయాందోళనల దృష్ట్యా దుకాణాల్లో సరుకులు కూడా త్వరితగతిన ఖాళీ కానున్నాయి. కాబట్టి ఈ దిగువ పేర్కొన్నట్లుగా సరైన ప్రణాళికతో నిత్యావసరాల సేకరణ, రవాణా, పంపిణీ చేయాల్సివుంది.
1. సేకరణ
రాష్ట్ర జనాభాకు అనుగుణంగా కావాల్సిన నిత్యావసర సరుకులను అంచనా వేయాలి. మన అవసరాలకు అనుగుణంగా సరైన చర్యలను తీసుకోవాలి.
2. రవాణా
కావాల్సిన వాటన్నింటినీ ఒకసారి గుర్తించి వాటిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసేందుకు సిద్దం చేశాక, ట్రక్కులు, లారీలలో వాటిని రవాణా చేయబోయే ముందు కరోనా వైరస్ ప్రభావానికి లోనుకాకుండా వాటిని పకడ్బందీగా ప్యాక్ చేయాలి.
3. పంపిణీ
4. నిర్దేశిత గమ్యస్థానాలకు ఆయా సరుకులు చేరుకున్న తరువాత, వాటిని ఆయా కుటుంబాలకు పంపిణీ చేయడమే అత్యంత కీలకం. ఒకేచోట జన సమ్మర్దం కాకుండా, గుంపులుగా గుమికూడకుండా పరస్పరం భౌతిక దూరం ఉండేటట్లుగా చూడటం అత్యంత ప్రధానం.
ఆయా ప్రాంతాలవారికి వాటిని సురక్షితంగా అందచేసేందుకు నిత్యావసరాల పంపిణీ వికేంద్రీకరణ ఎంతో సహాయకారి అవుతుంది. సరుకుల పంపిణీ తేదీ, సమయాన్ని ప్రభుత్వమే ముందస్తుగా తెలియజేసి ఇంటింటికి డోర్ టు డోర్ పంపిణీ చేయాలి. నిత్యావసరాలు పంపిణీ చేసే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కావాల్సిన ఫేస్ మాస్క్ లు, శానిటైజర్లు, హ్యాండ్ గ్లోవ్స్, ఐ షీల్డ్ గాగుల్స్, ఫుల్ స్లీవ్ గౌన్లు అందజేసి కరోనా వైరస్ బారినుంచి కాపాడాలి.
ప్రతి కిలోమీటరు పరిధిలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఈ సరుకులను ఎప్పుడు సమయంలో పంపిణీ చేసేది ముందుగా ప్రకటించాలి. ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులను సమర్ధంగా ఎదుర్కోవడంలో భాగంగా ఈ నిత్యావసరాల పంపిణీ వికేంద్రీకరణను పర్యవేక్షించాలి.
పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరఫరా నిర్విఘ్నంగా, సక్రమంగా జరిగేలా రాష్ట్రప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలి. ఈ మొత్తం సేకరణ, రవాణా, పంపిణీ ప్రక్రియలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, సిబ్బందికి, ప్రజలకు మధ్య టచ్ పాయింట్స్ లేకుండా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాం.
ధన్యవాదాలతో
నారా చంద్రబాబు నాయుడు
శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత