మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే

179

ప్రతి ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య వివరాలనూ సమోదు చేయనున్న వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు
డేటా ప్రకారం కోవిడ్‌–19 నివారణకు మరిన్ని చర్యలు
లాక్‌డౌన్‌ను ప్రజలంతా పాటించాలి
విదేశాలనుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్‌లో ఉన్నవారిపైన కాకుండా జనసామాన్యంపైన కూడా దృష్టి
గురువారంలోగా సర్వే పూర్తి.దాని డేటా ఆధారంగా మరిన్ని చర్యలు
ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆదేశం

అమరావతి: రాష్ట్రంలో కోడిడ్‌– 19 పరిస్థితిపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష.
ఈనెల 31 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది.
అంతవరకూ ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి.
ఇప్పటివరకూ విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చినవారు, వారితో కాంటాక్ట్‌ అయినవారిపైన కాకుండా ప్రజలందరిమీద కూడా దృష్టిపెట్టాలి.
కోవిడ్‌–19 వ్యాప్తిని నిరోధించాలి.
దీనికోసం మరో దఫా వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో కలిపి  రాష్ట్రంలో ప్రతి ఇంటినీ కూడా సర్వే చేయించాలి.

సర్వే సమగ్రంగా జరిగేందుకు సహకరించాలి

లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే.. సత్వరమే వారికి వైద్య సహాయం అందించాలి.
ఈ సర్వే సమగ్రంగా జరుగుతుండడం వల్ల … ప్రజలకు మేలు జరుగుతుంది.
కోవిడ్‌–19ను వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలుగుతాం.
ప్రజలు బయట తిరిగితే.. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది.
అందువల్ల లాక్‌డౌన్‌ను ప్రజలంతా పాటించాలి.
మీరు ఇంట్లో ఉండడం వల్ల వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు చేసే సర్వేకు సహకరించిన వారు అవుతారు.
రాష్ట్రంలో కోవిడ్‌ –19 నివారణకు ప్రజలనుంచి పూర్తి సహకారం ఆశిస్తున్నాం.
రాష్ట్రంలో ఇప్పటివరకూ పాజిటవ్‌గా తేలిన కేసులన్నీ కూడా విదేశాలనుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారే.
ఇది సామాన్య ప్రజలకు వ్యాపించకుండా ఉండాలంటే వైద్య, ఆరోగ్యశాఖ, ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
రెండోసారి సర్వే ద్వారా వచ్చే డేటాను విశ్లేషించుకుని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుంది.
లక్షణాలు ఉన్నవారు విధిగా హోంఐసోలేషన్‌ పాటించాలి.
సమావేశంలో ఏపీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంసీ ఛైర్మన్‌ సాంబశివారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ స్పెషల్‌సెక్రటరీ కన్నబాబు పాల్గొన్నారు.

శార్వరి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు:వైయస్‌.జగన్‌

శ్రీ శార్వరి నామ సంవత్సరాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని; రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శార్వరిలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని… ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితి దృష్ట్యా ‘‘సామూహిక వేడుకలకు దూరంగా, మీ కుటుంబంతో వేడుకగా ’’ ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు, దాని వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ప్రజలంతా తమతమ ఇళ్ళకే పరిమితం కావాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా మీద విజయం సాధించి నవయుగానికి బాటలు వేయటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని, పూర్తి సహాయసహకారాలు అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.