చైనా హంటా వైరస్ రెడీ!

416

చైనా లో పుట్టిన మరో మహమ్మారి..హంటా వైరస్ కు ఒకరి బలి.చైనా కరోనా వైరస్ ను పుట్టించి
ప్రపంచ వినాశనానికి  పూనుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది మరణానికి ఈ
చైనా వైరస్ కారణమవుతోంది. ఆ ఉపద్రవం నుంచే ప్రపంచం కోలుకోలేని పరిస్థితుల్లో ఉండగా..
ఇప్పుడు మరో వైరస్ చైనాలోనే పురుడుపోసుకొని మనుషులను కబళించేందుకు రెడీ అవుతోంది.

హంటా వైరస్.. చైనాలో పుట్టిన మరో మహమ్మారి. తాజాగా
ఈ వైరస్ ఒకరిని బలితీసుకుంది. మరో 32 మందిలో ఈ
వైరస్ లక్షణాలు కనిపించాయి. చైనాకు చెందిన గ్లోబల్
టైమ్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలుపడంతో ఇప్పుడంతా హడలిచస్తున్నారు. ఈ ట్వీట్
కింద ఇంకా కుక్కలు – పిల్లలు – పాములు –
గబ్బిలాలు తినండి.. మరిన్ని వైరస్ లు మిమ్మల్ని తింటాయని నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు. చైనీయులపై
సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.

చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ లో ఈ వైరస్ పుట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. యూనాన్ ప్రావిన్స్ కు వచ్చిన ఓ వ్యక్తిలో హంటా వైరస్ లక్షణాలు కనిపించాయి. 33మంది ప్రయాణికుల బస్సులో ప్రయాణించిన ఆ వ్యక్తి హంటా వైరస్ లక్షణాలతో కొన్ని గంటల్లోనే మరణించడంతో చైనాలో తీవ్ర కలకలం రేగింది. వెంటనే చైనా ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. బస్సులో ప్రయాణించిన వారందరికి పరీక్షలు చేసింది. కొందరికీ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వారందరినీ ఆస్పత్రులకు తరలించారు.

హంటా వైరస్.. ఇది అంటు వ్యాధి కాదు.. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు – ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల నుంచి వైరస్ వ్యాపిస్తుంది. ఎలుకలు వదిలిన లాలాజలం.. మూత్రం – మలం ద్వారా మనుషులకు వైరస్ విస్తరిస్తుంది. ఎలుకలు కరవడము వలన వచ్చేఅవకాశమున్నది.

ఇది సోకిన వ్యక్తి మూత్రం – మలం ఇతరుల శరీరాలకు వెళితే వారికి ఈ వ్యాధి సోకుతుంది. అతడి మలం – మూత్రం మంచినీటిలో కలిసి ఆ నీరుతాగితే సంక్రమిస్తుంది. దీని లక్షణాలు డెంగ్యూ వ్యాధిని పోలి ఉంటాయి.. ప్రాథమిక దశలోనే గుర్తించి యాంటీ వైరల్ డ్రగ్ తీసుకుంటే ప్రమాదం లేదు. ప్రాథమిక దశలోనే ఈ వైరస్ ను గుర్తించకపోతే ప్రాణాంతకమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

హంటా వైరస్ లక్షణాలు..

తీవ్ర జ్వరం వస్తుంది
ఉన్నట్టుండి కండరాల నొప్పి
ఆ తర్వాత బీపీ తగ్గుతుంది

మూత్రపిండాల పనితీరులో మార్పులు – నీరుడు తక్కువగా అవడం – తరువాత దశలో నీరు ఎక్కువగా పోవడము – మూత్రపిడాలు పాడవడము – ఊపిరితిత్తుల సంబంధించి .. ఊపిరి తీసుకోవడములో ఇబ్బంది – గుండె వేగముగా కొట్టుకోవడము – దగ్గు ఎక్కువగా బాదించడము జరిగి గుండెపోటుకు గురై మరణిస్తారు.

ఒకే సమయంలో చైనాలో రెండు వైరస్ లు పుట్టుకురావడం ఆ దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే కరోనాను అరికట్టడానికి ఆపసోపాలు పడుతున్న చైనాకు ఇప్పుడు హంటా వైరస్ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. కరోనాను ఎదుర్కోలేకపోతున్న ప్రపంచం ఇప్పుడు హంటా వైరస్ ను ఎలా ఎదుర్కొంటుందనేది అంతుచిక్కని సమస్యగా మారింది.