– హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తే కరోనా రాదనే భావన కొన్ని పత్రికా కథనాల్లో వెల్లడైంది. ఇది వాస్తవం కాదు.

– సాధారణ వ్యక్తులెవ్వరూ కూడా ఈమందును వినియోగించకూడదు. దుష్పరిణామాలకు దారితీస్తుంది.

– కరోనా సోకిన వారికి మాత్రమే ఈమందును వాడాలని అఖిల భారత వైద్య పరిశోధన మండలి స్పష్టంచేసింది. ఇదికూడా ప్రత్యామ్నాయంలో భాగమే.

– అంతేకాక కరోనా సోకిన రోగులకు, సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ముందు జాగ్రత్తగా మాత్రమే ఇది వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో దీన్ని పాటిస్తున్నారు.

– అందువల్ల కరోనా రాకుండా ఉండాలంటే. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వాడితే సరిపోతుందన్న భావనలోకి ప్రజలెవ్వరూ వెళ్లవద్దని విజ్ఞప్తిచేస్తున్నాం. సాధారణవ్యక్తులెవ్వరూ కూడా ఈ మందును వినియోగించవద్దని కోరుతున్నాం.

– హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను కేవలం నిపుణుల పర్యవేక్షణలో, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇస్తున్నారు. కోవిడ్‌ సోకినవారికి, వారితో ఉన్నందువల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నవారికి పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఇస్తున్న మందు మాత్రమే. మందు తీసుకున్న వారు పూర్తి వైద్య పర్యవేక్షణలో ఉంటున్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించ ప్రార్థన.

ఇట్లు
ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ

By RJ

Leave a Reply

Close Bitnami banner