కోడెల ముందు చూపు.

132

కరోనా వైరస్ ప్రభావంతో నేడు ప్రపంచ మంతా అప్రమత్తమైంది. గతంలో ఎన్నూడు లేనివిదంగా చేతులను శుభ్రం చేసుకోవాలని విసృతంగా ప్రచారం చేస్తుంది. చేతులు శుభ్రం చేసుకోవడం పై ప్రభుత్వాల తో పాటు పలు ప్రవేటు , స్వచ్చంద సంస్దలు కూడా చేతులు శుభ్రత పై అవగాహన చేస్తుంది. ఇప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడమే ప్రధాన అంశంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ చేతుల శుభ్రత పై గతంలోనే దివంగత నేత , మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ దృష్టి సారించారు. ఏపి అసెంబ్లీ స్పీకర్ గా పని చేస్తునే సామాజిక అంశాలపై కూడా ఆనాడు కోడెల దృష్టి పెట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గం లో విద్యార్థులు కు చేతులు శుభ్రం చేసుకోవడం పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. 2015 సంవత్సరం లోనే విద్యార్థులు తో చేతుల శుభ్రత చేపట్టారు. వేలాది మంది విద్యార్థులు తో సత్తెనపల్లి లో చేతులు శుభ్రం చేయించి గిన్నీస్ బుక్ రికార్డు లో కూడా చోటు సాదించారు. 2015 యోడాది లోనే డాక్టర్ కోడెల శివ ప్రసాద్ చేతులు శుభ్రత అంశంపై దృష్టి పెట్టడం ఆ రోజున అందరు నవ్వుకున్వారు . స్పీకర్ హోదా ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు ఏంటి అని కూడా స్వంత పార్టీ నేతలే హస్యస్పదంగా మాట్లాడుకున్నారు. వృత్తి రీత్యా స్వతహాగా కోడెల వైద్యుడు కావడం తో ఆయనకు వ్యక్తిగత శుభ్రత ఎంత అవసరమో తెలుసు. చేతులు శుభ్రం లేకుండా మనం ఆహారాలు స్వీకరించడం తో పలు రకాలు వ్యాదులు వచ్చే అవకాశం ఉంది. అందుకు సర్లరోగాలుకు నిలయమైన చేతుల అపరిశుభ్రత పై కోడెల ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ చేతుల శుభ్రత అంశం పెద్దలకు చెప్పి పెద్దగా ఉపయోగం ఉండదని గ్రహించి తొలుత విద్యార్థులపై ఫోకస్ పెట్టారు. విద్యార్థి దశలో ఏది నేర్పిన అది జీవితాంతం గుర్తు ఉంటుందని గ్రహించారు. అంతేకాకుండా విద్యార్థులకు చెబితే ఇళ్ళలో తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తారని గ్రహించి విద్యార్థులతో చేతులు శుభ్రం చేసే వినూత్న కార్యక్రమం చేపట్టారు. సత్తెనపల్లి లో వేలాది మంది తో చేతులు శుభ్రం చేయించి గిన్నీస్ బుక్ లో రికార్డు కూడా నమోదు అయ్యారు. రాష్ట్ర ప్రజల నుంచి దూరమైన దివంగత కోడెల శివ ప్రసాద్ ప్రస్తుతం కరోనా ప్రభావం తో ప్రతి ఒక్కరు ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు.

-వాసిరెడ్డి రవిచంద్ర