కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది

178

అమెరికాలో కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది. చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఆదివారం ప్రతి ముగ్గురు అమెరికన్లలో ఒకరు ఇంటికే పరిమితమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇక మృతుల సంఖ్య 24 గంటల్లో 100కు పైగా పెరిగినట్లు జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది.
ప్రస్తుతం అక్కడ మృతుల సంఖ్య 419గా ఉంది. బాధితుల సంఖ్య 33,546కు పెరిగింది.
చైనా, ఇటలీ తర్వాత ఇక్కడే అధిక సంఖ్యలో వైరస్‌ బారిన పడ్డవారు ఉన్నారు. మరోవైపు వైరస్‌ కట్టడికి అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకుంటున్న చర్యల్ని భారత సంతతికి వైద్యవర్గాలు స్వాగతించాయి. వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉందని ఆయా రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతోన్న తరుణంలో భారతీయ వైద్యులు మాత్రం ట్రంప్‌నకు మద్దతుగా నిలవడం గమనార్హం.