సీ.ఎస్. సోమేశ్ కుమార్,
తెలంగాణ:

“1897 కింద లాక్ డౌన్ అమలు చేస్తున్నాము.లాక్ డౌన్ వల్ల అంతర్ రాష్ట్ర బార్డర్స్ మూసివేస్తున్నాము.ఆర్టీసీ బస్సులు అన్ని బంద్ చేయించాము. ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.ఎక్కడ 5 మంది కంటే గుమిగూడా కూడదు.కొన్ని చోట్ల నిత్యావసర వస్తువుల దగ్గర మాత్రమే అలౌట్ లేదు. జీవో 45 లో ఉన్న ప్రతి అంశాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. పరీక్షలు అన్ని వాయిదా వేస్తున్నాము. రోడ్ మీద ఎక్కడ ఎలాంటి వాహనాలు నడవడానికి వీలు లేదు.రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవ్వరు బయట తిరిగినా కఠిన చర్యలు.గ్రామాల్లో వ్యవసాయ పనులు నడుస్తాయి. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు బయట తిరిగితే కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైనా బయట తిరిగితే పాస్ పోర్ట్ పై చర్యలు తీసుకుంటాము”.

డీజీపీ మహేందర్ రెడ్డి,
తెలంగాణ:

“కొరొనా వైరస్ తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలి.ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు తెలంగాణ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. జివో 45 ద్వారా ప్రజలకు అన్ని విషయాలను తెలియజేశాము.పబ్లిక్ అండ్ ప్రైవేట్ వెహికిల్స్ మాత్రమే అనుమతి ఉంది.ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలి.వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలి.సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలేవరూ రోడ్ల పైకి రావాలి.ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి. తెలంగాణ సమాజం కోసం పోలీసులు స్ట్రిక్ గా ఆంక్షలు అమలు చేస్తారు. అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది.డే టైం లో అమలులో ఉండే నిత్యావసర వస్తువులు అన్ని రాత్రి 7 గంటలకు క్లోజ్ చేస్తాము.ఒక కాలనీ లో వెహికిల్ లో ఒకటి రెండు కిలో మీటర్ల మాత్రమే తిరగాలి.ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము.ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు..ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారు.సీజ్ చేసిన వాహనాలు వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ చేస్తారు. ప్రైవేట్ వాహనాలు నిత్యావసర వస్తువులు క్యారీ మాత్రమే అనుమతి. మీడియాకు ఎక్కడైనా తిరికే అనుమతులు.
చట్టం చాలా కఠినంగా అమలు ప్రభుత్వ అధికారులు చేస్తారు.వైలేషన్ కి పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది.ప్రతి బైక్ పై ఒక వ్యక్తి… ఫోర్ వీలర్ పై ఇద్దరికి మాత్రమే అనుమతి.ఆటో అసోషియేషన్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాము. ఆక్ట్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసాము. ఇవ్వాళ మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలి. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి.లాక్ డౌన్ పై ప్రధాని-సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Reporter:
what about people who are stuck and would want to return to their native?

DGP:
no such options. This lockdown is to handle and reduce corona transportation to different places. They need to understand and look for alternate shelter arrangements locally. This pandemic is not as easy ad we think, people should stop going out, they should aware neighbors to stop going out too!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner