పాపం.. సినిమా వాళ్లకు సొమ్ముల్లేవట!

178

అనసూయకూ  కరోనా కష్టమొచ్చిందట
‘సినిమా బాబులు’ కార్మికులను ఆదుకోరేం?
రాజశేఖర్‌ను చూసి నేర్చుకోని స్టార్లు
సమాజానికి తిరిగి ఏమీ తిరిగి ఇవ్వని పిసినారి కుటుంబాలు

అనసూయ.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఆమెను ఎవరైనా చూశారా?
అదేనండీ..’జబర్దస్త్’ అనసూయ , కొనుక్కునేందుకు డబ్బులేక,  పొట్టి
దుస్తులేసుకునే అత్యంత పేద యాంకర్.‘రంగస్థలం’లో రంగమ్మత్త వేషం
వేసిన నటీమణి. ఇప్పుడు గుర్తొచ్చిందా?!.. హమ్మయ్య! ఎస్.. ఆ
అనసూయనే!! ఇంతకూ అనసూయమ్మకు ఏం కష్టం
వచ్చిపడిందనుకుంటున్నారా? కరోనా వల్ల అన్నీ మూత పడిపోయాయి.
దానివల్ల పనిలేక, ఆదాయం రాక.. రోజువారీ కూలీలు, మధ్య-కింది తరగతి
వర్గాలు నానా పాట్లు పడుతున్నాయి. సరే..వాళ్లు పాట్లు పడుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు.
కానీ, లక్షలు సంపాదిస్తూ, ఖరీదైన కారు అయిన ఆడి Q7(దాదాపుగా ఒక 90లక్షలు
ఉండవచ్చు)లో తిరిగే ‘అతి నిరుపేదరాలైన’ అనసూయమ్మకూ కరోనా కష్టాలొస్తున్నాయట.
అదీ వార్త! వినడానికి విచిత్రంగా లేదూ?

‘మేం పనులకు వెళ్లలేకపోతున్నాం. సంపాదించుకోలేకపోతున్నాం.
ఇంటి అద్దె, ఈఎంఐ వంటివి చెల్లించలేకపోతున్నాం. మా పరిస్థితిని
అర్ధం చేసుకుని కొన్ని ప్రొఫెషనల్స్‌కు ఈ నిబంధనలు
మినహాయించండి సార్’ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్
చేసింది. పాపం అనసూయ లాంటి ఖరీదైన యాంకర్ కూడా,
కరోనా పుణ్యాన కడుపేదరాలిగా మారిన వైనం చూసి, ఆమె అభిమానులు కార్చిన కడవల కొద్దీ
కన్నీరు, ఇప్పుడు సముద్రంలోకి చేరాయి.  ఖరీదైన కార్లు, టీవీషోలలో యాంకరింగు, సినిమాలో
వేషాల ద్వారా వచ్చే లక్షల ఆదాయం ఉన్న, అనసూయ లాంటి వారే ఇన్ని బీద అరుపులు

 

అరిస్తే.. ఇక సినిమా షూటింగులు ఉంటేనే,
నాలుగువేళ్లూ లోపలికి వెళ్లలేని సినిమా కార్మికుల
పరిస్థితి, ఇంకెంత భయానకంగా ఉందో
ఊహించుకోవచ్చు.ఈ కామెంట్‌కి సోషల్ మీడియాలో
నెటిజన్లు తెగ ట్రాలింగ్ చేసున్నారు.ట్రాల్ చేసేవారిని
కూడా తెగ తిట్టెసేంది అనసూయ.అనచ్చు కానీ మరి
ఇంతలా అనకూడదు అని అంటున్నారు జనాలు.మరి ఇదివరకు తనను ఫోటో తీస్తున్న బాలుడి దగ్గరికి వెళ్లి ఆ బాలుడి చేతిలోని ఫోన్ లాక్కొని పగలకొట్టింది.మరి వారికి డబ్బులు ఇవ్వలేదేం?వారివి డబ్బులు కావా? అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. సరే..తర్వాత, మన రంగమ్మత్త ఇంకో ట్వీటిచ్చి,అంతకుముందు ట్వీటుకు ‘కవరింగ్ లెటరు’ ఇచ్చిందనుకోండి. అది వేరే విషయం.ఇంతకూ మన అనసూయమ్మ ఏడాది సంపాదన జగస్.. రెండు కోట్లు మాత్రమేనన్నది ఫిలింనగర్ పక్షుల ఉవాచ.

కరోనా కల్లోలం తెలుగు సినిమా పరిశ్రమనూ కలవరపెడుతోంది. రోజూ ఏదో
ఒక షూటింగు, సీరియళ్ల  ద్వారా, పొట్టపోసుకునే జూనియర్ ఆర్టిస్టులు,
పరిశ్రమలోని అన్ని రంగాల్లో  పనిచేసే కార్మికులకు.. షూటింగులు
లేకపోవడం వల్ల ఆదాయం పోయింది. ఫలితంగా కృష్ణానగర్‌లో వారి కష్టాలు
వర్ణించనలవి కాదు. ఈ విషాదకర పరిస్థితిని గమనించిన హీరో రాజశేఖర్,
తన ట్రస్టు ద్వారా వారికి చేతనయినంత సాయం చేస్తుండటం
అభినందనీయం. సినీ కార్మికుల సాయం కోసం ఒక ఫోను నెంబరు కూడా ఇచ్చి,
తాత్కాలికంగానయినా వారి ఆకలి తీరుస్తున్న రాజశేఖరే, నిజమైన హీరో అన్నది నిష్ఠుర సత్యం.

‘సినిమా బాబులు’ కార్మికులను ఆదుకోరేం?

కానీ.. పరిశ్రమ ద్వారా కోట్లు,
వందల కోట్లు సంపాదించుకున్న
‘సినిమా బాబు’లు కనీసం, తమ
కార్మికులను ఆదుకునేందుకు
నయాపైసా విదిలించకపోవడమే
దారుణం. ‘ఎంగిలిచేత్తో కూడా
కాకిని తోలని’ ఘనకీర్తి గల,  కొన్ని పిసినారి హీరోల కుటుంబాలు కూడా, తిండిలేక
పస్తులుంటున్న సినిమా కార్మికులకు సాయం చేయకపోవడం ఆశ్చర్యం. పత్రికా ప్రకటనలు,
ట్వీట్ల ద్వారా జనహితం కోరుతూ ఉపన్యాసాలు ఇచ్చే ఈ బాపతు తాజా-మాజీ హీరోలు సమాజానికి
తిరిగి ఇచ్చే ప్రతిఫలం సున్నా. కానీ, సినిమాల్లో తమ పాత్రల ద్వారా మాత్రం.. ఈ సమాజానికి
ఎంతో కొంత ఇచ్చేయాలని సుద్దులు చెబుతుంటారు. ఐదు,పది లక్షల విరాళమిచ్చి.. దానితో,
కోటి రూపాయల పబ్లిసిటీ చేసుకునే ఈ మానవతామూర్తుల దానాలు చూసి,  కళామతల్లి
మురిసిపోవడం ఒక్కటే తక్కువ!

సమాజానికి తిరిగి ఏమీ తిరిగి ఇవ్వని పిసినారి కుటుంబాలు

జనం సినిమా టికెట్లు కొనడంద్వారా, కోట్లకు పడగలెత్తిన ఈ హీరోలకు, కొందరు హీరోల
కుటుంబాలకు  సామాజిక బాధ్యత ఎలాగూ లేదు. కనీసం, తాము ఈ స్థాయికి వచ్చేందుకు
సహకరించిన కార్మికుల పట్ల,  కనీస మానవత్వం చూపని ఈ హీరోల హీరోయిజం ఎందుకు?
తెరపైన హీరోయిజం చూపించే ఇలాంటి పిసినారి హీరోలకు, తెరవెనుక కార్మికులకు
చేయూతనిస్తున్న నిజమైన హీరో రాజశేఖర్‌కూ తేడా లేదూ?!హీరో నితిన్ కూడా తన వంతు
సాయంగా రెండు రాష్ట్రాలకు చెరో 10 లక్షలు విరాళం ప్రకటించాడు.

6 COMMENTS

  1. […] అయితే.. గ్యాంగ్‌లీడర్లు  ఇద్దరు సీఎంలకు కలిసిన పాయింటు కామనే. అదేంటంటే.. సినిమా షూటింగులు ప్రారంభించాలని ఒకరి వద్ద, అడగకుండానే వరమిచ్చినందుకు మరొకరి వద్దకు వెళ్లి బంతిపూలివ్వడానికి! అదేనండీ.. బోకేలివ్వడానికి!! బాగానే ఉంది. సొంత రాష్ట్రానికి వెళ్లిన ఈ సినీ హీరోలు, నిర్మాతలు, దర్శకుల గ్యాంగ్, ఆ గ్యాంగ్‌లీడర్.. మరి అమరావతిలో రాజధానిని అక్కడే కొనసాగించాలని  అడిగారా? పోనీ, ఆ డిమాండ్‌తో తమ వద్దకు వచ్చిన రైతులను కలిశారా? వారి గోడు విన్నారా? అంటే అదేం లేదు. స్థలాలు, స్టుడియోలు, సినిమా హాళ్లకు కరెంటు రాయితీలు, థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్ ఛార్జిల ఎత్తివేత, నంది అవార్డులు! ఇవే సినీ గ్యాంగ్‌లీడర్ల అజెండా!!ఇది కూడా చదవండి: పాపం.. సినిమా వాళ్లకు సొమ్ముల్లేవట! […]

  2. […] అయితే..గ్యాంగ్‌లీడర్లు  ఇద్దరు సీఎంలకు కలిసిన పాయింటు కామనే. అదేంటంటే.. సినిమా షూటింగులు ప్రారంభించాలని ఒకరి వద్ద, అడగకుండానే వరమిచ్చినందుకు మరొకరి వద్దకు వెళ్లి బంతిపూలివ్వడానికి! అదేనండీ.. బోకేలివ్వడానికి!! బాగానే ఉంది. సొంత రాష్ట్రానికి వెళ్లిన ఈ సినీ హీరోలు, నిర్మాతలు, దర్శకుల గ్యాంగ్, ఆ గ్యాంగ్‌లీడర్.. మరి అమరావతిలో రాజధానిని అక్కడే కొనసాగించాలని  అడిగారా? పోనీ, ఆ డిమాండ్‌తో తమ వద్దకు వచ్చిన రైతులను కలిశారా? వారి గోడు విన్నారా? అంటే అదేం లేదు. స్థలాలు, స్టుడియోలు, సినిమా హాళ్లకు కరెంటు రాయితీలు, థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్ ఛార్జిల ఎత్తివేత, నంది అవార్డులు! ఇవే సినీ గ్యాంగ్‌లీడర్ల అజెండా!!ఇది కూడా చదవండి: పాపం.. సినిమా వాళ్లకు సొమ్ముల్లేవట! […]

  3. […] అయితే..గ్యాంగ్‌లీడర్లు  ఇద్దరు సీఎంలకు కలిసిన పాయింటు కామనే. అదేంటంటే.. సినిమా షూటింగులు ప్రారంభించాలని ఒకరి వద్ద, అడగకుండానే వరమిచ్చినందుకు మరొకరి వద్దకు వెళ్లి బంతిపూలివ్వడానికి! అదేనండీ.. బోకేలివ్వడానికి!! బాగానే ఉంది. సొంత రాష్ట్రానికి వెళ్లిన ఈ సినీ హీరోలు, నిర్మాతలు, దర్శకుల గ్యాంగ్, ఆ గ్యాంగ్‌లీడర్.. మరి అమరావతిలో రాజధానిని అక్కడే కొనసాగించాలని  అడిగారా? పోనీ, ఆ డిమాండ్‌తో తమ వద్దకు వచ్చిన రైతులను కలిశారా? వారి గోడు విన్నారా? అంటే అదేం లేదు. స్థలాలు, స్టుడియోలు, సినిమా హాళ్లకు కరెంటు రాయితీలు, థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్ ఛార్జిల ఎత్తివేత, నంది అవార్డులు! ఇవే సినీ గ్యాంగ్‌లీడర్ల అజెండా!!ఇది కూడా చదవండి: పాపం.. సినిమా వాళ్లకు సొమ్ముల్లేవట! […]