ఏప్రిల్‌ 14వరకు 144 సెక్షన్‌:సీపీ ద్వారకా తిరుమలరావు 

534

విజయవాడ:విజయవాడలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకు 144 సెక్షన్‌
అమలులో ఉంటుందని నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సోమవారం నుంచి
ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘కరోనా సోకిన యువకుడికి కుటుంబ సభ్యులు
దూరంగా ఉన్నారని చెబుతున్నా వారికీ పరీక్షలు అవసరం. వారి కుటుంబ సభ్యులు బయటికి వస్తే వైరస్‌
విస్తరించే అవకాశం ఎక్కువ. విజయవాడలో కరోనా కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 7995244260 కు ఫోన్‌ చేయడం
ద్వారా కరోనాపై ఫిర్యాదులు చేయవచ్చు’ అని నగర సీపీ తెలిపారు.

విజయవాడ అప్‌డేట్స్

నగరంలో ప్రధాన రహదారులపై రాకపోకలను నిలిపివేసిన పోలీసులు

బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డులో బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహనాలను హైవే వైపు మళ్ళిస్తున్న పోలీసులు

అత్యవసర వచ్చే వారికి మినహా మిగిలిన వారు వాహనాల్లో నగర వీధుల్లో సహకరించవద్దని పోలీసుల ప్రచారం

నగరంలోని రైతు బజార్లలో విపరీతంగా పెరిగిన రద్దీ

ఈ నేపథ్యంలోనే జింఖానా గ్రౌండ్స్, తోపాటు పిడబ్ల్యూడి గ్రౌండ్స్ ఇతర విశాలమైన ప్రదేశాల్లో తాత్కాలికంగా రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు అధికారుల సన్నాహాలు

1 COMMENT