అమరావతి: కరోనాపై వైద్యఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించింది.
నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ రాగా అతడు కోలుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు విదేశాల నుంచి 13,301 మంది వచ్చారని ప్రభుత్వం
తెలిపింది. అయితే వారిలో 11,206 మంది స్వీయనిర్భందంలో ఉన్నట్లు వెల్లడించింది. 2,222 మందికి హోమ్‌ ఐసోలేషన్‌ పూరైనట్లు.. మరో 11026 మంది
హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ వైద్యులు 178 శాంపిళ్లను పరీక్షించగా 150 శాంపిళ్లు నెగిటివ్‌ వచ్చాయి. మరో 22 శాంపిళ్లకు సంబంధించి
రిపోర్టులు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేషన్ క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు
చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే, ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల కోవిడ్ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలో ఇప్పటి వరకు ఆరు కరోనా
పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్న సీఎం జగన్ వారిలో ఒకరికి నయం అయిందన్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వారికి కరోనా లక్షణాలు ఉంటే 104కు నెంబర్‌కు కాల్ చేసి చెప్పాలన్నారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner