చైనా ప్రపంచాన్ని మోసం చేసిందా?

478

చైనా ప్రపంచాన్ని కరోనా పేరుతో మోసం చేసిందా? తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు వైరస్‌ బూచిని వాడుకుందా?
అంటే అవుననే అంటున్నారు అమెరికా,యూరప్‌కు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్లు.
చైనాలోని ప్రతిష్టాత్మక కంపెనీల్లో తమకున్న అత్యంత విలువైన షేర్లను.. అతి తక్కువ ధరలకే ఆ దేశ ప్రభుత్వానికే అమ్ముకోవాల్సి రావడంపై వారు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు పక్కా వ్యూహం ప్రకారమే కరోనాను చైనా తెరపైకి తెచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ దేశంలో బలంగా పాతుకుపోయిన యూరప్, అమెరికా చెందిన పెట్టుబడిదారులను తరిమేయడానికి చైనా ఈ పన్నాగం పన్నినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎలాంటి రాజకీయ వ్యూహాలు అమలు చేయాల్సిన అవసరం లేకంఉడానే..వారిని సాగనంపేందుకు చైనా ఈ వ్యూహాన్ని అమలు చేసిందంటున్నారు విశ్లేషకులు.

ఈ కలకలానికి ముందు చైనాలోని ప్రముఖ రసాయన, సాంకేతిక పరిశ్రమల్లో యూరప్‌, అమెరికా చెందినవారి పెట్టుబడులే అధికంగా ఉండేవి.
ఫలితంగా సగం లాభాలను ఆయా దేశాల వారే ఎత్తుకెళ్లేవారు. ఆ ప్రభావం చైనా కరెన్సీ యాన్‌పై పడేది. నిత్యం ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వచ్చేది.
తమ ఆర్థిక వ్యవస్థను ఇతర దేశాలు శాసించడం నచ్చని చైనా… ఇందుకోసం కరోనాను అస్త్రంగా వాడుకున్నట్టుగా భావిస్తున్నారు.
దేశం మొత్తం కాకుండా…వ్యుహాన్ వరకే కరోనా పరిమితమయ్యేలా చూసుకుంది.

దీనిని అధిగమించేందుకు కనీసం మాస్కులు కొనే ఆర్థిక పరిస్థితులు కూడా లేవన్న రూమర్స్‌ను చైనా విజయవంతంగా స్ప్రెడ్ చేసుకోగలిగింది. కరోనా నుంచి తమ దేశాన్ని కాపాడుకోవడం కష్టమేనంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు.. ఆ దేశంలో పారిశ్రామిక రంగంపై అనుమానాలు పెంచాయి. దీంతో విదేశీ ముదుపుదార్లు అయినకాడికి తమ వాటాలను అమ్ముకున్నారు.ఫలితంగా రెండే రెండు రోజుల్లో 20 బిలియన్ డాలర్ల సంపదను చైనా సంపాదించింది.ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా అత్యంత పకడ్బందీగా చైనా తన ప్లాన్‌ను అమలు చేసింది.ఈ విషయం అర్థమయ్యేసరికి అమెరికా, యూరప్‌ పెట్టుబడిదారుల షేర్లన్నీ చైనా ప్రభుత్వం చేతిలోకి వెళ్లాయి.

ఇది నిజంగానే చైనాను ముప్పు తిప్పులు పెట్టింది. కానీ ప్రపంచం ఊహించినంత రేంజ్‌లో మాత్రం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కరోనా సంబంధించిన యాంటీ వైరస్‌ను ఇప్పటికే తయారు చేసుకుని ఉంచుకున్నట్టు కూడా తెలుస్తోంది. వరల్డోమీటర్ గణాంకాలు కూడా చైనాపై అనుమానులు రేకెత్తించేలా ఉన్నాయి.

కరోనా వైరస్ పుట్టిన చైనాలో ఇప్పటి వరకు మొత్తం 81,054 కోవిడ్-19 కేసులు నమోదైతే అందులో 72,440 కేసులు రికవరీ అయ్యాయి.
అయితే ఇటలీలో మొత్తం 53,578 కేసులు నమోదు అయితే, అందులో6,072 మంది మాత్రమే రికవరీ అయ్యారు. అలాగే మిగతా దేశాల గణాంకాలు కూడా ఉన్నాయి.
వైరస్ పుట్టి, అత్యధిక కేసులు నమోదు అయిన చైనాలో అత్యధిక మంది వ్యాధి నుంచి కోలుకోవడం చూస్తే.. ఆ దేశం కరోనా వైరస్‌కు సంబంధించిన యాంటీ వైరస్‌ను తయారు చేసిందేమోననే అనుమానం కలగకమానదు.