ఉల్లంఘిస్తే ఊరుకోవద్దు: కేంద్రం

165
A man sits at New Delhi's border barricade during lockdown by the authorities to limit the spreading of coronavirus disease (COVID-19), in New Delhi, India March 23, 2020. REUTERS/Adnan Abidi

లాక్‌డౌన్‌ కఠినంగా అమలుచేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు
దిల్లీ: రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్‌ని కఠినంగా అమలుచేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఉల్లఘించినవారిపై చర్యలు
తీసుకోవాలని ఆదేశించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు
నిన్న కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ని ప్రజలు నిర్లక్ష్యం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం
తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని పిలుపు మేరకు ఆదివారం యావత్తు దేశం జనతా కర్ఫ్యూని విజయవంతం చేసిన
విషయం తెలిసిందే. అదే స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని పలువురు అధికారులు కోరారు. కరోనా వైరస్‌ను ఓడించాలంటే
ఇదొక్కడే మార్గమని సూచించారు. అంతకుముందు లాక్‌డౌన్‌ని నిర్లక్ష్యం చేయరాదని ప్రధాని దేశప్రజల్ని కోరిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం
అలక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ ఎదుర్కొంటున్న అనుభవాన్ని గుర్తెరిగి మసలుకోవాలని సూచించారు.