తిరుమల శ్రీవారి దర్శనం లేదు…టిటిడి సంచలన నిర్ణయం..!

268

కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనాన్ని నిలిపి వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం నుంచి భక్తులను తిరుమలకు అనుమతించడం ఆపేసింది. తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డు, అలిపిరి, శ్రీవారి మెట్లు నడక మార్గాలను మూసివేసింది. ఇప్పటికే తిరుమలలో ఉన్న భక్తులకు దర్శనం చేయించి అందరినీ కిందకు పంపివేసిన తర్వాత గురువారం మధ్యాహ్నం నుంచి శ్రీవారి ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు. పూజాది కార్యక్రమాలు ఏకాంతంగా, యధావిధిగా జరుగుతాయి. భక్తులను దర్శనానికి అనుమతించారు. బుధవారం మధ్యాహ్నం తిరుమల వెళ్లేందుకు అలిపిరి టోల్గేట్ చేరుకున్న భక్తులను వెనక్కి వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను మూసివేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో లేక వెలవెలబోతున్నాయి‌. తాజా నిర్ణయంతో వేలాదిమంది భక్తులతో కిటకిటలాడే తిరుమల కూడా నిర్మానుష్యంగా మారింది.