కడపలో రెండు కరోనా అనుమానిత కేసులు

478

కడప రిమ్స్‌లో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. కడపలోని బెల్లమండి వీధికి చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం మక్కా నుంచి నగరానికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ఆమె జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసంతో బాధపడుతుండటంతో రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు కరోనా అనుమానిత వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తి కూడా రెండు రోజుల క్రితం గల్ఫ్‌ నుంచి నగరానికి వచ్చారు. ఆయనకు సైతం దగ్గు, జలుబు, జ్వరం అధికంగా ఉండటంతో రిమ్స్‌కు తరలించారు. వీరిద్దరికీ కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో రిమ్స్‌లోనే కరోనా ప్రత్యేక వార్డులో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి నుంచి నమూనాలను సేకరిస్తున్నారు.

Two corona suspected cases have been reported in Kadapa rims. A woman from Bellamandi Street in Kadapa returned to the city from Mecca two days ago. She has since been rushed to Rims, suffering from colds, coughs, fever and fatigue. Doctors examined were rushed to the coroner’s ward and treated. Another man came to the city two days ago from the Gulf. He was also rushed to the rims due to high cough, cold and fever. The coroner is conducting preliminary tests at the special ward in Rims, as both of them have coronary suspicions. Samples are being collected from them.