ఇండియాకు తమకు అత్యంత ప్రియమైన దేశమo

460

ఇండియాకు తమకు అత్యంత ప్రియమైన దేశమని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ భూమ్మీద అమెరికా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరా లేనట్టి శక్తివంతమైన ఆయుధాలను భారత్‌కు ఇస్తామని ప్రకటించారు. మంగళవారం భారత్ తో 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంటామని వెల్లడించారు. అమెరికా, భారతదేశాలు రెండూ అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, ఈ పోరాటం తమ రెండు దేశాలనూ కలుపుతోందని చెప్పారు.తన పాలనలో ఐఎస్‌ను 100 శాతం నిర్మూలించానని.. ఐఎస్ అధినేత అల్ బాగ్దాదీ హతమయ్యాడని ప్రకటించిన ట్రంప్ రక్షణ ఒప్పందాల్లో భాగంగా మిత్ర దేశం భారత్ కు ఈ భూమండలం మీద అత్యుత్తమం అనదగ్గ మిలిటరీ పరికరాలను అందించాలనుకుంటున్నామని చెప్పారు. మరెవరూ తయారుచేయలేనంత గొప్ప ఆయుధాలను మేం తయారుచేశాం.. ఇప్పుడు వాటిని భారత్‌కూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.పాకిస్థాన్‌లో ఉన్న ఉన్న ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించేందుకూ ప్రయత్నిస్తున్నామని.. తమకు మంచి సంబంధాలు ఉన్నందున సానుకూల పద్ధతుల్లోనే ఉగ్రవాద శిబిరాల నిర్మూలనకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.