రేపు విజయవాడలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారిచేతులమీదుగా “విజన్ డాక్యుమెంట్ ” ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది అని రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు.ఇప్పటికే ఇరుపార్టీల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఇచ్చిన ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని రాష్ట్రంలో చిన్న చిన్న ఘటనలు మినహా అందరూ సకాలంలో అభ్యర్థిత్వం ఖరారు నమూనాలు సమర్పించారు ఆని నాగభూషణం తెలిపారు.రేపు ఆవిష్కరణ జరగనున్న ప్రజా కార్యాచరణ ప్రణాళికను ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజాలముందు ఉంచి స్థానిక ఎన్నికలే గెలుపు లక్ష్యంగా పనిచేసి భాజపా – జనసేన పార్టీ ల కూటమికి అఖండ విజయం సాధించి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని నాగభూషణం కోరారు

By RJ

Leave a Reply

Close Bitnami banner