నాన్న ఆత్మహత్య బాధగా వుంది

286

నల్గొండ మార్చ్ 9 : నాన్న మారుతీ రావు ఆత్మహత్య చేసుకునే పిరికి వాడు కాదు. కొంతకాలంగా నాన్నకు బాబాయ్ శ్రవణ్ కు ఆస్తి గొడవలు జరిగాయి. .ఆ విషయంలో నాన్న మారుతీరావుపై బాబాయ్ శ్రవణ్ చేయి చేసుకున్నాడని మారుతీ రావు కూతురు అమృత ఆరోపించింది. సోమవారం ఆమె మీడియా ముందుకు వచ్చింది. డబ్బుల విషయంలో సుఫారీ గ్యాంగ్ బెదిరింపులు కూడా ఒక కారణం కావొచ్చు. బాబు పుట్టాక అమ్మ నాతో మాట్లాడింది.బాబు ను చూపించాలని కోరితే నేను నిరాకరించానని అన్నారు. నాన్నకు కోర్టు పరంగా శిక్ష పడాలని కోరుకున్నా…ఆత్మహత్య చేసుకోవడం తప్పే. అమ్మ దగ్గరికి వెళ్లలేను….దగ్గరికొస్తే వద్దనుకోను. బాబాయ్ శ్రవణ్ తో అమ్మకు ప్రాణ హానీ ఉందని అమృత తెలిపింది. అమ్మతో వెళ్ళమన్న నాన్న కోరిక నెరవేరుస్తా… అలా అని అత్త,మామలను వీడాలంటే ఒప్పుకోను. నాన్న ఆత్మహత్య చేసుకోవడం కూతురిగా భాద పడుతున్నానని అన్నది. ప్రణయ్ ని చంపాడు అని కోపం తో తప్ప నాన్నపై నాకు ఎటువంటి కోపం లేదు. కేసు కు సంబంధించి ట్రయిల్ షెడ్యూల్ రాలేదు. అడ్వకెట్స్ ఇష్యూస్, జైల్లో ఉన్న ఇతర నిందితుల ప్రెజెర్స్ వల్ల ఇలా అయిందని అమృత తెలిపింది. దేని వల్ల సూసైడ్ చేసుకున్నారో తెలియదు. ఒక మనిషిని చంపించిన వ్యక్తి, అతను సూసైడ్ చేసుకుంటాడు అని అంటే వేరే కారణలు కూడా కావొచ్చు. ప్రణయ్ ని చంపారు అని తప్ప..మా మధ్య వేరే గొడవలు లేవు. ప్రణయ్ లేకపోయినా.. నాకు అత్త, మామా,కొడుకు ఉన్నారు. ప్రణయ్ ని చంపారు న్యాయ పరంగా శిక్ష పడాలి అని కోరుకున్నామని అన్నది. మారుతి రావు చనిపోయిన విషయం గురించి మొదటగా నాకు క్లారిటీ లేదు. తండ్రి అనే నేను చూడటానికి వెళ్ళాను..నన్ను చూడనివలేదు. శ్రావణ్ వల్ల మా అమ్మ కి భవిష్యత్ లో ప్రమాదం ఉంటుంది అనుకుంటున్నానని ఆమె అన్నది.