అన్న క్యాంటీన్ల రద్దు పేదల పొట్టకొట్టడమే-పేదల జీవితాలతో జగన్ ఆటలాడుతున్నారు…

367

-ఆనంద్ బాబు, -కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు

 

పేదవాళ్లు, కూలీపనులు చేసుకునే వాళ్లు, పట్టణాలకు వివిధ పనులపైన వచ్చే వాళ్ల ఆకలి బాధలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడి ప్రభుత్వం జూలై 2018 లో అన్న క్యాంటీన్లను ప్రారంభించారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఆత్మకూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు అన్ని పట్టణ ప్రాంతాలలోని 73 మున్సిపాలిటీలలో 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. మూడు పూటల భోజనం కేవలం రూ . 15 రూపాయలకే కడుపునిండా అన్నం పెట్టి ఆకలి తీర్చింది చంద్రబాబు నాయుడి ప్రభుత్వం. ఇందుకోసం ఆ కాంట్రాక్టు ఏజెన్సీకి రోజుకు రూ. 73 రూపాయలు చెల్లించాం. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఈ పథకం నిరాటంకంగా సాగింది. దాదాపు సంవత్సరానికి రూ 200 కోట్ల రూపాయలు బడ్జట్ లో కేటాయించి ఖర్చుచేయడం జరిగింది. పట్టణ ప్రాంతాలలోనే కాకుండా మేజర్ పంచాయితీలైన పెద్ద పెద్ద గ్రామాలలో కూడా దాదాపు 370 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రణాళికలు కూడా రూపొందించుకోవడం జరిగింది. అన్న క్యాంటీన్ల ప్రారంభించిన తర్వాత దాదాపు 1 కోటి 30 లక్షల మంది ఆకలి తీర్చడం జరిగింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మూసివేసి ఆ కోటి 30 లక్షల మంది పొట్టగొట్టారు. ఎన్నికలు ముగిసి రిజల్ట్ప్ వచ్చిన తర్వాత వైసీపీ వాళ్లు నరసారావుపేట, సత్తెనపల్లి ప్రాంతాలలో క్యాంటీన్లపై పడి ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల వైసీపీ రంగులు వేసుకుని క్యాంటీన్ కు ఒక ప్రక్క వైఎస్ఆర్ బొమ్మ మరోప్రక్క జగన్ బొమ్మలను ముద్రించుకుని రాజన్న క్యాంటీన్లని పేర్లు రాసుకున్నారు. సిగ్గులేకుండా రంగులు, పేర్లు మార్చుకుని భోజనాలు మాత్రం పెట్టలేదు. పేదవాడి కడుపులు కొట్టిన ప్రభుత్వంగా మిగిలిపోయింది ఈ ప్రభుత్వం.

కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..

పేదవాడికి పట్టెడన్నం పెట్టడం కన్నా రాజకీయ పరమార్ధం ఏముంటుంది అని అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి స్పూర్తితో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 11, 2018 న రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఉదయం నాణ్యమైన, రుచికరమైన అల్సాహారం, మద్యాహ్నం, రాత్రి రెండు పూటలా భోజనాలను కేవలం రూ. 15 రూపాయలకు అందించిన ఘనత చంద్రబాబు నాయుడుగారిది. రోజుకు 2 లక్షల 15 వేల మంది ఆకలి తీర్చే అలాంటి అన్న క్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి రావడంతోనే మూసివేయడం సిగ్గుచేటు. అన్నక్యాంటీన్ల రంగులు మార్చడానికి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చుచేసిన ఈ ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చడానికి ఎందుకు ఖర్చుచేయలేకపోయింది? పేదవాడు కడుపునిండా అన్నం తింటే చూడలేని దౌర్బాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. రంగులు మార్చినంత మాత్రానా క్యాంటీన్లు మూసివేసినట్టా అని అన్న బొత్స ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.? పేదవాడికి వ్యతిరేకమైన ఈ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు నిరసన కార్యక్రమాలు తెలుగుదేశం చేపట్టబోతుంది. రేపు అన్న క్యాంటీన్ల పరిసర ప్రాంతాలలో వంటావార్పు కార్యక్రమాలతో నిరసన తెలియజేయాలని కోరుతున్నాను.

అశోక్ బాబు మాట్లాడుతూ..

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన 15 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కార్యక్రమంలో భాగంగా రేపు అనగా 24.02.2020న మూసేసిన 203 అన్న క్యాంటీన్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాడానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతుంది. ఒక రిక్షా పుల్లర్, ఒక ఆటో డ్రైవర్, పట్టణాలకు వలస వచ్చిన కార్మికులు ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లను మూసివేయడం ద్వారా ఈ ప్రభుత్వం దాదాపు కోటి 30 లక్షల మందిని మోసం చేసింది. అన్న క్యాంటీన్లను సచివాలయాల క్రిందకు మార్చడం సిగ్గుచేటు. పట్టణాలలో పేదవాళ్లు సంపాదించేదాంట్లో సగం భోజనాలకు పోతే వాళ్లు ఎలా బ్రతుకుతారు అనే అలోచన ఈ ప్రభుత్వానికి కరువైంది. ఈ ప్రభుత్వం చేసిన రద్దులన్నింటిలలో అన్న క్యాంటీన్ల రద్దు చాలా దారుణమైనది. కాబట్టి దీనిపై ప్రజల్లో అవగాహన కల్సించడానికి రేపు జరిగే కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలతో పాటు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నా. ఇసుక వల్ల లక్షల మంది ఉపాధి కోల్పోయారు. దీని వల్ల నిర్మాణ రంగం దెబ్బతింటం తో రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడిపోయింది. ఈ రోజు కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్లు ఆ డబ్బులు కూడా చెల్లించడం లేదు.

బచ్చుల అర్జనుడు మాట్లాడుతూ..

అన్న క్యాంటీన్లను రద్దు చేయడమంటే పేదవారి పొట్టగొట్టడమే. ఈ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల నుండి పేదవారి ఆకలితో ఆడుకుంటున్నారు. పేదవారపై భారాన్ని మోపి వారికి కావాల్సినటువంటి ఇసుక లేకుండా చేసి దాదాపు 40 లక్షల మంది కార్మికులను ఇబ్బందులు పాలుచేశారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టడం ప్రభుత్వం యొక్క ప్రాధమిక చర్య. అలాంటి ప్రాధమిక చర్యను కూడా చేయాలని ఈ ప్రభుత్వాన్నిఏమనాలి? గ్రామాల నుండి పట్టణాలకు పొట్టచేతపట్టుకుని కూలీ పనుల కోసం వచ్చేవాళ్లు క్యారేజీలు తెచ్చుకునే పరిస్థితి ఉండదు. ప్రొద్దున్నే చద్దన్నం తిని పనులకు వెళుతుంటారు. అలాంటి పేదవాని నోటికాడి కూడు లాగేసిన ఈ ప్రభుత్వానికి పేదలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. క్యాంటీన్లకు రంగులు మార్చుకుని, సచివాలయ బోర్డులు తగిలించుకుని అసెంబ్లీలో మాత్రం పచ్చి అబద్దాలు ఆడారు. అర్ధంపర్ధంలేని విధానాలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది. అన్నపూర్ణ అని పేరుపొందిన ఈ ఆంధ్రప్రదేశ్ లో పేదవాడి ఆకలి తీర్చాలనే ఆలోచన చేయలేని ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉన్నట్టా?

 

1 COMMENT