ఈ రోజు మునిసిపల్ ఎన్నికల కు నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తెలియచేశారు.

రాష్ట్రంలో ని 15 మునిసిపల్ కార్పొరేషన్ లకు గాను 12 మునిసిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికల నిర్వహిస్తున్నాము. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు మూడు మునిసిపల్ కార్పొరేషన్ లకు కోర్ట్ ఉత్తర్వులకు లోబడి డిలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్, తదితర కారణా లు కారణంగా జరపడం లేదన్నారు.

అదేవిధంగా 104 మునిసిపాలిటీ/నరగ పంచాయతీ లకు గాను 75 వాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము. ఎన్నికల ప్రవర్తన నియమావళి కి అనుగుణంగా ఎన్నికల పరిశీలకులు తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశామన్నారు. మునిసిపల్ లోకల్ బాడీస్ స్థానాలు కోసం ఎన్నికలు ఒకే దశలో నిర్వహించడం జరుగుతొందన్నారు.

ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ వివరించారు.

నోటిఫికేషన్ జారీ తేదీ : 9.3.2020

రిటర్నింగ్ అధికారి/ ఎన్నికల అధికారి చే ఎన్నికల నోటీస్ జారీ తేదీ: 11.03.2020

నామినేషన్లు ప్రక్రియను తేదీ : 11.3.2020 నుంచి 13.03.2020 వరకు

నామినేషన్లు పరిశీలన తేదీ: 14.3.2020

అభ్యర్థిత్వము ల (నామినేషన్లు) ఉపసంహరణ తేదీ: 16.3.2020 మ. 3 .00 వరకు

పోటీ చేయు అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ తేదీ :16.3.2020 మ. 3 .00 తరువాత

పోలింగ్ నిర్వహించే (అవసరమైన పక్షంలో) తేదీ: 23.03.2020 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు

ఒకవేళ రిపోలింగ్ నిర్వహించాల్సి వొస్తే ది.26.3.2020న నిర్వహించడం జరుగుతుంది.

ఓట్ల లెక్కింపు తేదీ: 27.3.2020 ఉదయం 8 గంటల నుంచి

ఓట్ల లెక్కింపు పూర్తి అయిన వెంటనే ఫలితాలు ప్రకటన చెయ్యడం జరుగుతుంది

ఈ విలేకరుల సమావేశంలో మునిసిపల్ పరిపాలనా శాఖ కమిషనర్ విజయ కుమార్, సెక్ జాయింట్ సెక్రటరీ ఎ. వి.సత్య రమేష్ లు పాల్గొన్నారు.

Click blow to download

LIST OF MPL. CORPORATIONS, MPL, . NPs

 

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner