ఎట్టకేలకు గ్రామపంచాయతీ రిజర్వేషన్లు ఖరారు చేశారు…….

333

మొత్తం పంచాయతీలు: 969
ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 596 కేటాయింపు
మొత్తం స్థానాల్లో 51 శాతం మహిళలకు రిజర్వు
ఎస్టీ మహిళ: 137

ఎస్టీ జనరల్‌: 124

ఎస్సీ మహిళ: 39

ఎస్సీ జనరల్‌: 25

బీసీ మహిళ: 138

బీసీ జనరల్‌: 133

అన్‌రిజర్వుడ్‌ మహిళ: 181

అన్‌రిజర్వుడ్‌ జనరల్‌: 192
ఎట్టకేలకు గ్రామపంచాయతీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలో 969 పంచాయతీలు, 9542 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్‌  ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆమోదముద్ర వేశారు. మొత్తం 969 గ్రామ పంచాయతీల సర్పంచ్‌ పదవుల్లో అన్ని కేటగిరీలు కలిపి మహిళలకు 495(51 శాతం) కేటాయించారు మొత్తం 9,542 వార్డులకుగాను చెరిసగం…. 4,771 మహిళలకు, 4,771 జనరల్‌కు కేటాయించారు. కాగా సర్పంచ్‌ పదవుల విషయానికి వస్తే ఎస్టీలకు 261, ఎస్సీలకు 64, బీసీలకు 271 కేటాయించగా, అన్‌రిజర్వుడ్‌ కింద 373  వున్నాయి.

ఎస్టీలకు షెడ్యూల్‌ ఏరియా, నాన్‌షెడ్యూల్‌ ఏరియా వేర్వేరుగా రిజర్వేషన్లు చేపట్టారు. దీంతో జిల్లాలో 11 మండలాలతో కూడిన ఏజెన్సీలో 244 గ్రామ పంచాయతీలలో మహిళలకు 126, జనరల్‌కు 118 కేటాయించారు. కాగా మైదాన ప్రాంతంలో ఎస్టీలకు సంబంధించి మహిళలకు 11, జనరల్‌లో ఆరు వెరసి 17, ఎస్సీలలో మహిళలకు 39, జనరల్‌లో 25  మొత్తం 64 కేటాయించారు. బీసీలకు సంబంధించి మహిళలకు 138, జనరల్‌కు 133 వెరసి 271, అన్‌ రిజర్వుడ్‌లో మహిళలకు 181, జనరల్‌లో 192 వెరసి 373 కేటాయించారు. షెడ్యూల్డ్‌ ఏరియాలో 2,254 వార్డులలో మహిళలకు 1165, జనరల్‌కు 1089, ఆన్‌ రిజర్వుడ్‌లో 192లో మహిళలకు 58, జనరల్‌లో 134 కేటాయించారు. మైదానంలో ఎస్టీలకు 177కిగాను మహిళలకు 121, జనరల్‌లో 56, ఎస్సీలకు కేటాయించిన 576 వార్డులలో మహిళలకు 445, జనరల్‌లో 131, బీసీలకు 2,342 వార్డులకుగాను మహిళలకు 1,156, జనరల్‌లో 1,186 వార్డులు కేటాయించారు. అన్‌ రిజర్వుడ్‌లో 4,001 వార్డులకుగాను మహిళలకు 1,826 రిజర్వు చేయగా, జనరల్‌లో 2,175  వార్డు వున్నాయి.