పేదలకు ఇంటి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ

186

డిజైన్‌పై దృష్టిసారించిన ప్రభుత్వం

బెడ్‌రూం, కిచెన్, పెద్ద హాలు, వరండా, టాయిలెట్‌ సదుపాయాలతో పేదలకు ఇళ్లు

నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు
ఒకే నమూనాలో కాలనీలు
కాలనీల్లో డ్రైనేజీ, విద్యుత్, పచ్చదనం, తాగునీరు తదితర కనీస మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం

ఏడాదికి 6.5 లక్షల చొప్పున ఇళ్ల నిర్మాణం

అమరావతి: పేదలకు వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 30 లక్షల ఇళ్ల డిజైన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. బెడ్‌రూం, కిచెన్,పెద్ద హాలు, వరండా, టాయిలెట్‌ సదుపాయాలతో ఈ ఇళ్లను నిర్మించడానికి సమాయత్తమవుతోంది.

గృహనిర్మాణంపై సమీక్ష సందర్భంగా పేదలకు కట్టించనున్న ఇంటి డిజైన్‌పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. తాము రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. పేదలకు నిర్మించి ఇచ్చే ఇళ్లు అత్యంత నాణ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలని స్పష్టంచేశారు. ఇంటి డిజైన్‌లో భాగంగా ఏం ఇవ్వబోతున్నామో అడిగి తెలుసుకున్నారు. బెడ్‌రూం, కిచెన్, హాలు, వరండా, టాయిలెట్‌లను డిజైన్‌లో పొందుపరిచామని అధికారులు తెలిపారు. గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా డిజైన్‌ రూపకల్పనలో జాగ్రత్తలు పాటించామన్నారు. వీటికి సీఎం కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. నాణ్యత విషయంలో రాజీపడరాదని మరోమారు స్పష్టంచేశారు.
సంవత్సరానికో 6.5 లక్షల ఇళ్ల చొప్పున నిర్మించడానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీల్లో పచ్చదనం, పరిశుభ్రత, కరెంటు సౌకర్యం లాంటి కనీస వసతుల ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. కాలనీలన్నీ మార్గదర్శకంగా ఉండేలా చర్యలను తీసుకుంటున్నారు.

1 COMMENT