అమరావతి- కరోన వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై బులెటిన్ విడుదల చేసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ
కరోనా వైరస్(కొవిడ్19) విషయంలో ఆందోళన చెందొద్దు
వదంతులు, నిరాధార ప్రచారాన్ని విశ్వసించవద్దని తెలిపిన వైద్యఆరోగ్యశాఖ
కొవిడ్ 19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలి
వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ నంబరు కొవిడ్ 19 లక్షణాలేమైనా ఉంటే తక్షణం మాస్క్ ను ధరించాలి.
కొవిడ్ 19 ప్రభావిత దేశాల నుండి ఏపీకి వచ్చిన 378 మంది ప్రయాణికులు
వైద్యుల పరిశీలనలో ఉన్నారు
153 మంది ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారు
218 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురి ఆరోగ్యపరిస్థితి స్థిమితంగా ఉంది.
27 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 20 మందికి నెగటివ్ అని తేలింది.
ఏడుగురి శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది
కొవిడ్ 19 నియంత్రణ కు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం
ఇప్పటి వరకూ ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదు
కొవిడ్ 19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టాం
విమానాశ్రయాలు, ఓడ రేవుల్లో స్క్రీనింగ్ చేస్తున్నాం.
కె.ఎస్ జవహర్ రెడ్డి,
వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
డ్రగ్స్ డిజి ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్ పెక్టర్లు 382 మెడికల్ షాపులపై దాడులు చేశారు

అధిక ధరలకు మాస్క్ లు గానీ , మందులుగానీ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
లైసెన్స్ లు కూడా రద్దు చేస్తాం
మెడికల్ షాపులపై దాడుల్ని కొనసాగిస్తాం
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner