8న బడ్జెట్‌.. 20 వరకు అసెంబ్లీ సమావేశాలు

154

హైదరాబాద్‌ : అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీతో పాటు శాసనసభ, మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేశారు. ఈ నెల 8వ తేదీ(ఆదివారం)న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 12 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 9, 10, 15 తేదీల్లో సభకు సెలవులు ప్రకటించారు. బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్‌, మంత్రులు, అక్బరుద్దీన్‌ ఓవైసీ, భట్టి విక్రమార్క హాజరయ్యారు.