సింహాచలం దేవస్థానం భూములపై వైసీపీ కుట్ర: మంతెన సత్యనారాయణ

432

ఆస్తులు కబ్జాకు విజయసాయి రెడ్డి నేతృత్వంలో క్రిమినల్ ప్లాన్
ఎగ్జిక్యూటివ్ రాజధాని పేరుతో విశాఖ చుట్టు పక్కల సుమారు 39వేల ఎకరాలను కబ్జా చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో.. ఇప్పుడు ఏకంటా ట్రస్టు భూములు, ఆలయ భూముల్ని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు యత్నించడం సిగ్గుచేటు.

సింహాచలం ఆలయ భూముల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకున్నా.. జగన్మోహన్ రెడ్డికి అదే చివరి రోజు అవుతుంది. దోచుకోవడం, దాచుకోవడం, అమ్ముకోవడం వంటి తప్పుడు విధానాల్లో ఆరితేరిపోయిన ఏ -1, ఏ-2 దేవాలయాల జోలికి వస్తే క్షమించేది లేదని గుర్తుంచుకోవాలి.

విజయనగరం రాజ వంశీకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్‌ గజపతిరాజుపై జగన్మోహన్ రెడ్డి అండ్ కో పథకం ప్రకారం కుట్ర పన్నారు. రహస్య ఉత్తర్వులతో ఆయనను సింహాచలం దేవస్థానం చైర్మన్‌ పదవి నుండి, విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌(మాన్సాస్‌) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించడం కుట్ర కాదా?

అర్ధరాత్రి వేళ రహస్య జీవోలు ఇవ్వడం, ఆగమేఘాలపై సింహాచలం దేవస్థానం పాలకమండలి చైర్‌ పర్సన్‌గా… మాన్సాస్‌ ట్రస్టు సారథిగా నియమిస్తూ ప్రమాణ స్వీకారం చేయించడం వెనుక మీ భూ ఆక్రమణల కుట్ర లేదా.?

మన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉన్న రూ.10 లక్షల కోట్ల విలువైన 14,800 ఎకరాల భూముల్ని కబ్జా చేసేందుకు విజయసాయి రెడ్డి విశాఖలో తిష్ట వేసి మరీ ప్లాన్ చేస్తున్నారనేది వాస్తవం కాదా.?

గతంలో ఆలయ భూములను ఆక్రమించి, వాటికి క్రమబద్ధీకరించేందుకు కొంత మంది ప్రయత్నించగా.. అశోక్‌ గజపతిరాజు గట్టిగా అడ్డుకున్నారు. కానీ నేడు ఆ భూముల్ని స్వాహా చేసేందుకు విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో క్రిమినల్ ప్లాన్ ఉంది.

దేవదాయ, ధర్మాదాయ చట్టం ప్రకారం సింహాచలం దేవస్థానానికి ప్రభుత్వం ట్రస్టు బోర్డు సభ్యులను మాత్రమే నియమిస్తుంది. వారంతా కలసి ఆ సభ్యుల్లో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకోవాలి. ప్రభుత్వం నేరుగా చైర్మన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చినా చెల్లవని తెలిసీ… జగన్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది.

క్విడ్ ప్రో కో వంటి కొత్త విధానాలతో రాష్ట్రాన్ని దోచుకుని లక్షల కోట్లు వెనకేసుకున్నావు. ట్రస్టు భూములు, అప్పన్న స్వామి భూముల జోలికి వస్తే క్షమించేది లేదు.

 

మంతెన సత్యనారాయణ రాజు
శాసనమండలి సభ్యులు