అందరికీ సొంతిల్లు ఉండాలనేది వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం

332

– రూ. 91 లక్షలతో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన
– వందలాది కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు
– అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ
– దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌

అందరికీ సొంతిల్లు ఉండాలనేది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం అని, ఉగాది నాడు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్‌లో జొన్నవిత్తుల వారి వీధి లో సిసి రోడ్ కు 45 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డుకు మరియు హేమాద్రి చలపతిరావు వీధిలో 46 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులకు మంత్రి వెలంపల్లి శంకుస్థాపన చేశారు.

ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం వైయస్‌ జగన్‌ చరిత్ర సృష్టించనున్నారన్నారు. విజయవాడ నగరంలో 50 వేల మంది ఇళ్లు లేనివారిని గుర్తించామన్నారు. సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్డు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వందలాది కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు.

కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు మరియు అధికారులు ఉన్నారు..