అమరావతి:

ఉగాది నాటికి సుమారు 26 లక్షల ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోదం
43,141 ఎకరాల భూమిని ఇళ్ల స్ధలాల రూపంలో పంపిణీకి సిద్ధం చేసిన ప్రభుత్వం
ఇంటి స్ధలం పట్టాను రిజిస్ట్రేషన్‌ చేసి మరీ లబ్దిదారులకు అందించనున్న ప్రభుత్వం
26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ఎకరాల ప్రైవేటు భూమిని ఇళ్ల స్ధలాల కోసం సిద్ధం చేసిన ప్రభుత్వం
యుద్ధ ప్రాతిపదికన ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్‌ చేసిన ప్రభుత్వం
ప్రతీఏటా 6 లక్షలకు పై చిలుకు ఇళ్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్ల నిర్మాణం
ఈ కాలనీలకు వైయస్సార్‌ జగనన్న కాలనీలుగా పేరు
స్టాంపు పేపర్‌మీద రిజిస్ట్రేషన్‌ చేసి మరీ ఇళ్లపట్టాలు ఇవ్వనున్న ప్రభుత్వం
ఈ ప్రక్రియకోసం ఎమ్మార్వోలకు జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ హోదా కల్పించిన ప్రభుత్వం

నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ పై క్షేత్ర స్ధాయి నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌పై కేబినెట్లో చర్చ
కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని.. వారిలో అభద్రతాభావం తొలగించాలని, 2010 నాటి ప్రశ్నావళికే పరిమితం కావాలని, తదనుగుణంగా ప్రస్తుతం ఉన్న ఎన్‌పీఆర్‌ ప్రశ్నల నమూనాను మార్పుచేయాలని తీర్మానం
అప్పటివరకూ ఎన్‌పీఆర్‌ ప్రక్రియను అబయెన్స్‌లో ఉంచాలని నిర్ణయం
దీనికి ఆమోదముద్ర వేసిన మంత్రిమండలి

రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
భావనపాడు, మచిలీపట్నంలలో పోర్టుల ఏర్పాటుకు ఇదివరకే ప్రభుత్వం చర్యలు

పీపీపీ విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌
బిడ్డింగ్‌లో కాంట్రాక్ట్‌ దక్కించుకున్న జిఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌(హైదరాబాద్‌)
మరో 362.55 ఎకరాల భూసేకరణచేయాల్సి ఉండగా…. దీనికి అవసరమైన రూ.280 కోట్లు ధనాన్ని రుణం రూపంలో తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ డవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌కు(ఏపీఏడిసిఎల్‌) అనుమతి

కాకినాడ సమీపంలో తొండంగి మండలం కోన గ్రామం వద్ద పోర్టు నిర్మాణం కోసం 9 నెలల కాలవ్యవధిని పొడిగిస్తూ .. కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌కు అనుమతినిస్తూ కేబినెట్‌ ఆమోదం
కాకినాడ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌లో 49 శాతం ఈక్విటీని అదానీ పోర్టు అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌కు బదిలీ చేస్తూ చేసుకున్న ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సీడ్‌ డవలప్‌మెంట్‌ ‡కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు రూ.500 కోట్లు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం
దీనివల్ల కొత్తరుణాల లభ్యత, తద్వారా తొలకరిలో ముమ్మరంగా విత్తన పంపిణీ

ఏపీ జెన్‌కో, ఏపీపిడిసిఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) చెరో రూ.1000 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.2వేల కోట్ల ప్రభుత్వం నుంచి బ్యాంకు గ్యారంటీకి కేబినెట్‌ ఆమోదం
తద్వారా తాజా రుణాలు పొందే అవకాశం, ఈ రుణాలతో నిర్మాణంలో ఉన్న కృష్ణపట్నం 800 మెగావాట్లు, వీటీపీఎస్‌లో 800 మెగావాట్ల థర్మల్‌ కేంద్రాలను పూర్తి చేయాలని నిర్ణయం

ప్రకాశం జిల్లా ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి కేటాయించిన 1.96 ఎకరాల భూమి కేటాయింపు రద్దు చేస్తూ జారీ చేసిన జీవోకి కేబినెట్‌ ఆమోదం, తిరిగి ఆ భూమిని వాటర్‌ రీసోర్స్‌ డవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించి, ఎన్‌ఎస్‌పి కాలనీ విస్తరణకు వినియోగించాలని నిర్ణయం

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సున్నిపెంటలో 4 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
అందులో 44 పోస్టుల భర్తీకి కేబినెట్‌ అనుమతి

రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, భూ అక్రమాలపై కేబినెట్‌ సబ్‌కమిటీ నివేదికలోని అంశాలపై విచారణ అధికారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు అప్పగిస్తూ కేబినెట్‌ ఆమోదం

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner