రాష్ట్రంలో బడుగు బలహీన, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం పాటు పడుతుంటే, చంద్రబాబు మోకాలడ్డుపెడుతున్నారు

262

మీడియా సమావేశంలో వైయస్సార్‌సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు, ఎంఎల్‌సీ జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యలు

రాష్ట్రంలో బడుగు బలహీన, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం పాటు పడుతుంటే, చంద్రబాబు మోకాలడ్డుపెడుతున్నారు. ఆటంకాలు సృష్టిస్తున్నారు. స్థానిక సంస్థలలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ రిజర్వేషన్ల పెంపును టీడీపీ జీర్ణించుకోలేదు.

రిజర్వేషన్ల పెంపును టీడీపీ నేతల సన్నిహితులు వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన ఘటనే అందుకు ఉదాహరణ. ఈవ్యవహారం వెనుక ఉన్న దురుద్దేశ్యం ఏమిటో ప్రజలు ఆలోచించాలి.

జనగణన సర్వే ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లను 59.85 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రాజకీయ రిజర్వేషన్లపై ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోయారు.

రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తూ చంద్రబాబు శిష్యుడు, నారా లోకేష్‌ అనుచరుడైన ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఆయన టీడీపీ ఎంఎల్‌సీ రాజేంద్రప్రసాద్‌ సన్నిహితుడు కూడా.

బడుగు బలహీన, వెనుకబడిన వర్గాల అభివృద్ధి్దకి దోహద పడే రిజర్వేషన్ల పెంపు నిర్ణయం అమలు కాకుండా కుట్రపూరితంగా కోర్టుకెక్కారు. ప్రభుత్వ నిర్ణయం అమలు జరగకుండా మోకాలడ్డారు.

తన హయాంలో చంద్రబాబు బడుగు బలహీన, బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు. అవసరం వచ్చినపుడు వాడుకుంటూ వారిని మోసం చేస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం నిరంతరం ప్రయత్నించే చంద్రబాబు బడుగులను అవమాన పర్చారు. దళితులను హేళన చేశారు. ఎస్టీలను గేలి చేశారు.మత్స్యకారులు, రజకులు, ఇతర బీసీ వర్గాలను అవమానపర్చారు.

బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి మద్దతు ఇస్తున్నారన్న కోపంతో చంద్రబాబు ఆ వర్గాల అణిచివేతకు ప్రయత్నిస్తున్నారు. రిజర్వేషన్ల పెంపును తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ, ఆయా వర్గాలు నష్టపోవడానికి ప్రధాన కారణమైంది.

బడుగు బలహీన, వెనుకబడిన వర్గాలపై కక్ష సాధించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు సిగ్గుండాలి. హైకోర్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటీషన్‌ దాఖలు చేసిన వ్యక్తి ప్రతాప్‌రెడ్డి చంద్రబాబు మనిషి కాదా? ప్రతాప్‌రెడ్డి టీడీపీ నేతలతో కలిసి విందులలో పాల్గొనలేదా?

స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు జీవోను హైకోర్టు వ్యతిరేకంచడం వల్ల బలహీనవర్గాలు తీవ్రంగా నష్ట పోయాయి. రాష్ట్రంలోని 1365 పంచాయతీలలో పది శాతం రిజర్వేషన్లు తగ్గిపోవడం మూలాన బీసీలు రాజకీయంగా నష్టపోతున్నారు.

తమకు చెందాల్సిన పదవులు రావడం లేదు. అదేవిధంగా జడ్‌పీటీసీలు, ఎంపీటీసీ పదవులలో కూడా వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నాయి.జనాభా ప్రాతిపదికపై చేసిన రిజర్వేషన్ల నిర్ణయాన్ని వ్యతిరేకించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతారు.

వెనుకబడిన వర్గాలు, బడుగుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. బీసీ కమిషన్ను శాశ్విత ప్రాతిపదికపై ఏర్పాటు చేశారు.

ఎస్‌సీ, ఎస్‌సీ కార్పొరేçషన్లకు ఛైర్మన్లను నియమించారు. నామినేటెడ్‌ పదవులలో రిజర్వేషన్ల అమలు వల్ల మార్కెట్‌ యార్డు కమిటీలలో పలువురికి పదవులు లభిస్తున్నాయి. మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ పదవులు వెనుకబడిన వర్గాలకు దక్కుతున్నాయి.

వీరి సంక్షేమం కోసం చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా? అణగారిన వర్గాలు, కులాల మధ్య కుంపటి పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పాటు పడ్డారు. వారి సంక్షేమాన్ని గాలికి వదిలి వేశారు.

చంద్రబాబు అనేక విషయాలలో ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తున్నారు. శాసనసభలో ఒక విధంగా కౌన్సిల్‌లో మరోవిధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.

ఎస్‌సీ, ఎస్టీ కమిషన్లను టీడీపీ వ్యతిరేకించింది. చంద్రబాబు దృష్టిలో బలహీనవర్గాలు అభివృద్ధి కారాదా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా వారుండాలా?

పాఠశాలల్లో ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టే ప్రతిపాదనను మండలిలో టీడీపీ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయం మేరకు విద్యార్థుల భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని పై నిర్ణయాన్ని తీసుకుంటే టీడీపీ ఎందుకు వ్యతిరేకించాలి?

ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళరాదా? వారు కాలానుగుణంగా మారరాదా? ఆంగ్ల బోధనను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించాలి?

రాష్ట్రంలోని వివిధ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుండగా చంద్రబాబు ప్రతి విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు.

అమ్మ ఒడి, పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంటు, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్నారు. వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనలపై చంద్రబాబు విమర్శలను గుప్పిస్తున్నారు.

చంద్రబాబు వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. బడుగు బలహీన, వెనుకబడిన వర్గాలకు తీరని అన్యాయం చేస్తోన్న ఆయన చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని జంగా కృష్ణమూర్తి హెచ్చరించారు.