BC ల రిజర్వేషన్ల పై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

396

బీసీలపై సావితితల్లి ప్రేమ చూపిస్తున్న వైసీపీ ప్రభుత్వం

176వ జి.ఓ చెల్లదు అని హై కోర్టు కీలక తీర్పే జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని నిదర్శనం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రేజర్వేషన్లపై సుప్రీమ్ కోర్టులో ఆపిల్ చెయ్యాలి

– విలేకర్ల సమావేశంలో టీడీపీ నాయకుల ధ్వజం

రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు సముచిత స్థానం కల్పించి రేజర్వేషన్లు పెంచుతామంటూ బీసీలను మోసం చేసే విధంగా సావితితల్లి ప్రేమ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చూపింది అని దీనికి నిదర్శనమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 176 జీవో చెల్లదంటూ హై కోర్టు తీర్పు ఇస్తూ 50శాతం రిజెర్వేషన్లు మించరాదు, గతంలో సుప్రీమ్ కోర్టు చెప్పిందే అమలు చెయ్యాలని తీర్పునివ్వడం దీనికి నిదర్శనమని టీడీపీ అర్బన్ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు,మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ దయ్యబట్టారు

మంగళవారం ఉదయం సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో హై కోర్టు కీలక తీర్పు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనం అంటూ బీసీలను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ నాయకులు పత్రికా,ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నవనీతం,ఎరుబోతు మాట్లాడుతూ 59.85 శాతం రేజర్వేషన్లు చట్ట విరుద్ధమని హై కోర్టు కీలక తీర్పు చెప్పి గతంలో సుప్రీమ్ కోర్టు చెప్పిన విధంగా 50శాతానికే పరిమితం చెయ్యాలని ఆ విధంగానే బీసీల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పడం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కోర్టులో చిట్టా శుద్ధి లేకుండా వ్యవహరించడానికి నిదర్శనమని విమర్శించారు. బీసీలకు 34శాతం ఇచ్చే పంచాయితీ రాజ్ చట్టంలోని సెక్షన్లను 9(1A),15(2),152(1A),153(2A),180(1A),181(2b), సెక్షన్లను హై కోర్టు ధర్మాసనం విచారించి 50శాతానికి మించి అమలుకు కుదరదు అని చెప్పిన తీర్పును గుర్తు చేశారు, అమరావతి రైతులకు అన్యాయం చేసేటువంటి విధంగా ఢిల్లీ నుండి 5కోట్ల నిధులతో ప్రఖ్యాత గాంచిన న్యాయవాదులను తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం బీసీల రేజర్వేషన్ల అంశంలో ప్రతిభ, నైపుణ్యం కలిగిన న్యాయవాదులను ఎందుకు తీసుకురాలేదో రాష్ట్రంలో బీసీలు అందరూ గమనించారని అన్నారు. బీసీల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న వైసీపీ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హితువు పలికారు. హై కోర్టు తీర్పుపై సుప్రీమ్ కోర్టులో ఆపిల్ చెయ్యాలని దానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మేము(టీడీపీ) సిద్ధంగా ఉన్నామని వైసీపీ ప్రభుత్వానికి బీసీ రేజర్వేషన్లపై చిత్త శుద్ధి లేదని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సన్నిహిత మిత్రుడు,బంధువు అయిన ప్రతాప్ రెడ్డితో బీసీ రేజర్వేషన్ల వ్యతిరేకంగా దాఖలు చేయించారంటే బీసీ తరుపున కపట ప్రేమ వహిస్తుందని స్థానిక సంస్థలు ఎన్నికలు ఏడాది క్రితమే జరగవలిసి ఉన్నా 9నెలల కాలం అధికారాన్ని అనుభవిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు పెట్టకపోవడం దారుణం అని మర్చి 30లోపు ఎన్నికల పెట్టకపోతే 14వ ఆర్ధిక సంఘం ప్రకారం 5వేల కోట్ల నిధులు నిలిచి పోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ ప్రభుత్వం మర్చి నెలాఖరులోపు స్థానిక సంస్థలు జరపాలని ఆ దమ్ము దైర్యం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా అని సూటిగా ప్రశ్నించారు. రేపు జరగబోయే రాష్ట్ర కాబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశం లో మాజీ కార్పొరేటర్ ఎరుబోతు శ్రావణి,టీడీపీ నేతలు నందేతి చంద్ర భాను సింగ్,పిరియా సోమేశ్వర రావు,పరుచూరి ప్రసాద్,దాసరి కనకారావు,లబ్బా వైకుంఠం,కోలా శ్రీను,రామారావు,పెద్ది శ్రీను తదితరులు పాల్గున్నారు.