నూజివీడు నియోజకవర్గంలో ప్రజాచైతన్య యాత్ర

293

నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలోని చింతలవల్లి, చెక్కపల్లి గ్రామాలలో జరిగిన ప్రజాచైతన్య యాత్రలో నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తో కలిసి శ్రీ దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం 5,100 కోట్లతో మంజూరు చేయించి మూడు వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టడం జరిగిందని ఈ పది నెలల వైసిపి ప్రభుత్వ కాలంలో ఒక్క బొచ్చే సిమెంట్ వేయలేదని ఒక్క తట్ట మట్టి తవ్వలేదని వైసిపి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు చెల్లించాల్సిన 2000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని ఇంకా మిగిలివున్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని దేవినేని డిమాండ్ చేశారు.