శ్రీ బొత్స సత్యన్నారాయణ ప్రెస్ మీట్

392

రాష్ర్ట పురపాలకశాఖమంత్రి శ్రీ బొత్స సత్యన్నారాయణ ప్రెస్ మీట్ కామెంట్స్….

-స్దానిక సంస్దల్లో ఎస్సిఎస్టీలకు బిసిలకు న్యాయం చేయాలనే 59 శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నాం.

-50 శాతంకు రిజర్వేషన్లు మించకూడదని హైకోర్టు చెప్పింది.

-కోర్టు తీర్పునకు లోబడే ఎన్నికలకు వెళ్తాం.

-నెలరోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు చెప్పింది.

-రిజర్వేషన్లపై టిడిపి నేత ప్రతాపరెడ్డి కోర్టులో పిటీషన్ వేశారు.

-బడుగు,బలహీన వర్గాలకు అండగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం.

.-బడుగు బలహీన చంద్రబాబును ఎన్నటికి క్షమించవు.

-బడుగు,బలహీన వర్గాలకు పూర్తి స్దాయిలో న్యాయం చేయలేకపోతున్నాం.

-బలహీన వర్గాలకు మేలు చేసే ప్రతి అంశంలోనూ చంద్రబాబు అడ్డుపడుతున్నారు.

-ఈ విషయంలో చంద్రబాబు,టిడిపి నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నారు.

-చంద్రబాబుకు అధికారం ఇచ్చిన బిసిలకు ఇచ్చే బహుమానం ఇదేనా

-59 శాతం రిజర్వేషన్లు ఇస్తే టిడిపికి ఎందుకు కడుపు మంట

-నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ,ఎస్టి బిసి మైనారిటీలకు,మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల అవకాశం ఇచ్చాం.

-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇన్ని అవకాశాలు దక్కలేదు.

-ఎస్సి,ఎస్టికులాల్లో ఎవరైనా పుడతారా అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు.

-ఎస్సిఎస్టిలకు ప్రత్యేక కమీషన్లు ఏర్పాటును కూడా చంద్రబాబు వ్యతిరేకించారు.

-టిడిపిలోని బిసి నేతలు చంద్రబాబు వైఖరికి సిగ్గుపడాలి.

-గ్రామీణ,పట్టణాభివృధ్ది జరగకూడదని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.

-రాజధానిలో పేదలకు ఇంటిస్దలాలు ఇవ్వడాన్ని సైతం చంద్రబాబు అడ్డుకుంటున్నారు.

-సిఆర్ డి ఏ చట్టంలో చెప్పిన విధంగా 1250 ఎకరాలు ఇద్దామని భావించినా కూడా అడ్డుకోవడం దారుణం.

-రైతుభరోసా,అమ్మఒడి ఇలా ఏది తీసుకున్న వాటికి అడ్డుపడటమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు

-బడుగు,బలహీన వర్గాలకే ఈ పధకాలు అదికంగా అమలవుతాయి.

-అంబేద్కర్ చెప్పిన సమసమాజ స్ధాపనకు అనుగుణంగా పాలన ఇక్కడ జరుగుతోంది.

-ఎస్సీబిసిలు మైనారిటీలు అందరూ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు.వారికి పధకాలన్నీ అందితే వారంతా ఆ పార్టీతో ఉండిపోతారని చంద్రబాబు భయపడుతున్నారు.

-అసెంబ్లీ సమావేశాలు.విద్యార్దుల పరీక్షలు సమన్వయం చేసుకుని ఎన్నికల విషయంలో అధికారులు నిర్ణయం తీసుకుంటారు