టీడీపీ వెన్నెముక బీసీలని తెలిసే వారిపై కక్ష: యనమల రామకృష్ణుడు

334

టీడీపీ వెన్నెముక బీసీలని తెలిసే వారిపై కక్ష: మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, యనమల రామకృష్ణుడు

బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు జగన్‌కు ఇష్టం లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 15 వేల పోస్టులు రాకుండా జగన్‌ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ వెన్నెముక బీసీలని తెలిసే వారిపై కక్షగట్టారని ఆయన ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిథ్యం తగ్గించేందుకే ఇలాంటి చర్యలు చేపట్టారని అన్నారు. తన అనుచరుడితో జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయించారని యనమల ఆరోపించారు. 60 శాతం రిజర్వేషన్లతో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ప్రశ్నించారు.

రెడ్డి సంఘం అధ్యక్షుడితో కేసు వేయించడమే బీసీలపై జగన్‌ వ్యతిరేకతకు రుజువు అని యనమల వ్యాఖ్యానించారు.

బీసీ నిధుల్లో భారీగా కోతలు పెట్టారని, ఆదరణ పథకం రద్దు చేశారని అన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించారని…ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. ఇప్పుడు పేదల అసైన్డ్‌ భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలపై కక్షతోనే రిజర్వేషన్ల అంశం కేంద్రం దృష్టికి జగన్‌ తీసుకెళ్లలేదని యనమల విరుచుకుపడ్డారు.

1 COMMENT

  1. Please let me know if you’re looking for a article writer for your site. You have some really good posts and I feel I would be a good asset. If you ever want to take some of the load off, I’d absolutely love to write some material for your blog in exchange for a link back to mine. Please send me an e-mail if interested. Kudos!