బాపట్ల అభివృద్ధికి మరో మైలురాయి ..

356

మెడికల్ కాలేజ్ ఏర్పాటు ఓ చారిత్రాత్మక ఘట్టం, అది ఉపసభాపతి కోన రఘుపతి ద్వారా సాధ్యమైంది.

గతంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ ని స్థాపించిన స్వర్గీయ శ్రీ కోన ప్రభాకరరావు బాపట్ల ప్రాంతాన్ని ఓ ఎడ్యుకేషనల్ హబ్ గా తయారు చేశారు.అప్పటి నుంచి బాపట్ల లో వివిధ రకాలైన కళాశాలలు ఏర్పడటంతో భారతదేశంలో పలు ప్రాంతాల నుంచి ఇక్కడ చదువుకోటానికి అనేక మంది వస్తున్నారు. బాపట్లకు అన్ని రకాలైన కళాశాలలు ఉన్నయి. ఒక్క మెడికల్ కళాశాల తప్ప.దాన్ని కూడా సహకారం చేయాలనే ఉద్దేశంతో తీవ్రంగా శ్రమించి బాపట్ల ప్రాంతానికి మెడికల్ కాలేజీని మంజూరు చేయించడానికి ఉపసభాపతి కోన రఘుపతి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల కు మెడికల్ కాలేజ్ మంజూరైంది. 50 ఎకరాల విశాలమైన టువంటి ప్రాంతంలో మెడికల్ కాలేజ్ తో పాటు ఓ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల కూడా నిర్మించనున్నారు. మన ప్రాంత వాసులు బయటికి వెళ్లకుండానే కిండర్ గార్డెన్ నుంచి మెడికల్ కళాశాల వరకు ఉత్తమమైన విద్యను అభ్యసించడానికి మన ప్రాంత వాసులకు ఎంతో అందుబాటులో ఉండటం పాటు దగ్గరగా ఉండటం కూడా ఎంతో శుభ పరిణామం. ఎమ్మెల్యేగా ఎన్నికై, ఉపసభాపతి అయిన తరువాత అతి కొద్ది కాలంలోనే మెడికల్ కాలేజీని మన ప్రాంతానికి మంజూరు చేయించి, దానిని త్వరగబ్ నిర్మించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిని అందరూ అభినందించాల్సిన విషయం.బాపట్ల అభివృద్ధికి ఉపసభాపతి కోన రఘుపతి తీసుకుంటున్న చర్యలు, వేస్తున్న అడుగులు ఎంతో అభినందనీయం. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించటం తోపాటు ఈ ప్రాంత వాసులకు ఏది అవసరమో దాన్ని తీర్చడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ విధంగా బాపట్ల ప్రాంత వాసులు ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ మంజూరు అయినందుకు ఉపసభాపతి కోన రఘుపతి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.